iDreamPost
android-app
ios-app

Mr. Bachchan Day 1 collection: మిస్టర్ బచ్చన్ డే 1 కలెక్షన్స్! మాస్ మహారాజా ఎంత రాబట్టాడంటే?

  • Published Aug 16, 2024 | 9:15 AM Updated Updated Aug 16, 2024 | 3:24 PM

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం మిస్టర్ బచ్చన్. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలిరోజు ఎంత రాబట్టిందో ఇప్పుడు చూద్దాం.

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం మిస్టర్ బచ్చన్. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలిరోజు ఎంత రాబట్టిందో ఇప్పుడు చూద్దాం.

Mr. Bachchan Day 1 collection: మిస్టర్ బచ్చన్ డే 1 కలెక్షన్స్! మాస్ మహారాజా ఎంత రాబట్టాడంటే?

మాస్ మహారాజా రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ డివైడ్ టాక్ ను సొంతం చేసుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొట్టినప్పటికీ.. భారీ ఓపెనింగ్స్ ను కొల్లగొట్టడంలో మాత్రం మాస్ మహారాజా కాస్త తడబడ్డాడనే చెప్పాలి. పైగా మరోవైపు రామ్ డబుల్ ఇస్మార్ట్, విక్రమ్ తంగలాన్ మూవీస్ రిలీజ్ అవ్వడంతో ఓపెనింగ్స్ పై ప్రభావం చూపింది. మరి ఇంతకీ మాస్ మహారాజా తొలిరోజు ఎంత రాబట్టాడో ఇప్పుడు చూద్దాం.

థియేటర్లలోకి రవితేజ మూవీ వస్తుందంటే ఫ్యాన్స్ తో పాటుగా సగటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ఇక అభిమానుల ఎదురుచూపులకు తగ్గట్లుగానే మాస్ మహారాజా సైతం ఏడాదికి రెండు, మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాడు. తాజాగా ‘మిస్టర్ బచ్చన్’ ఆగస్ట్ 15న థియేటర్లలోకి వచ్చాడు. సినిమాలో కంటెంట్, మాస్ ఎలివేషన్స్, డైలాగ్స్ బాగున్నప్పటికీ.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో మార్నింగ్ షో నుంచే సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్మురేపిన రవితేజ.. భారీ ఓపెనింగ్స్ ను మాత్రం రాబట్టుకోలేకపోయాడు.

MR Bachan Day1 Collections

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. నైజాం- 2.10 కోట్లు, సీడెడ్- 73 లక్షలు, ఉత్తరాంధ్ర- 50 లక్షలు, తూర్పు గోదావరి- 26 లక్షలు, వెస్ట్ గోదావరి- 20 లక్షలు, నెల్లూరు- 18 లక్షలు, గుంటూరు- 38 లక్షలు, కృష్ణ- 21 లక్షలు ఇలా ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 4.56 కోట్ల షేర్ ని, రూ. 6.40 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది. వరల్డ్ వైడ్ తొలి రోజు రూ. 5.26 కోట్ల షేర్ ని రాబట్టింది. అయితే రవితేజ రేంజ్ కు ఇవి తక్కువ ఓపెనింగ్స్ అనే చెప్పాలి. కానీ ఇదే రోజు రామ్, విక్రమ్ ల మూవీలు కూడా రిలీజ్ అవ్వడంతో.. థియేటర్లు పంచుకోవాల్సి వచ్చింది. అయితే ముందు వీకెండ్ ఉండటంతో.. వసూళ్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మిస్టర్ బచ్చన్ ఓపెనింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.