Raviteja: టాలీవుడ్ లోనే టాప్! మాస్ మహారాజా స్పీడ్ కు బ్రేకుల్లేవ్..

టాలీవుడ్ లో ఓ క్రేజీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. మిగతా హీరోలందరూ ఈ లిస్ట్ లో రవితేజ వెనకాలే ఉండటం గమనార్హం. మరి ఆ క్రేజీ రికార్డు ఏంటి? ఆ వివరాలు..

టాలీవుడ్ లో ఓ క్రేజీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. మిగతా హీరోలందరూ ఈ లిస్ట్ లో రవితేజ వెనకాలే ఉండటం గమనార్హం. మరి ఆ క్రేజీ రికార్డు ఏంటి? ఆ వివరాలు..

రవితేజ.. 56 ఏళ్ల వయసు, 34 ఏళ్ల సినిమా కెరీర్. ఇన్నేళ్ల తన కెరీర్ లో ఎన్నో పాత్రలు చేశాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ మెుదలుకొని విలన్, హీరోగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ఏజ్ పైబడుతున్న కొద్దీ ఇప్పటికీ అదే స్పీడ్, ఎనర్జీతో కుర్ర హీరోలకు సవాల్ విసురుతూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఓ రికార్డ్ ను తన పేరిట లిఖించుకున్నాడు మాస్ మహారాజా. ఇంతకీ ఆ రికార్డు ఏంటి? తెలుసుకుందాం పదండి.

మాస్ మహారాజా రవితేజ.. కెరీర్ స్టార్టింగ్ నుంచి హీరోగా ఏడాదికి రెండు, మూడు సినిమాలు విడుదల చేస్తూ వస్తున్నాడు. ఫ్యాన్స్ కు ఎదురుచూసే వీలు కూడా రవితేజ ఇవ్వడు అంటే అతిశయోక్తికాదు. 56 ఏళ్ల వయసులోనూ ఇప్పటికే అదే జోరును కొనసాగిస్తున్నాడు. ఏడాదికి 2,3 సినిమాలు రిలీజ్ చేస్తూ.. ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ క్రేజీ రికార్డును నెలకొల్పాడు. కరోనా తర్వాత 2021 నుంచి ఇప్పటి వరకు ఏకంగా 8 సినిమాలను రిలీజ్ చేశాడు. 2021లో క్రాక్ మూవీతో సూపర్ హిట్ కొట్టాడు.

ఇక ఆ తర్వాత ఏడాది వరుసగా ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో ధమాకా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రూ. 100 కోట్ల క్లబ్ లో కూడా చేరింది. 2023లో మెగాస్టార్ తో కలిసి వాల్తేరు వీరయ్యతో మరోసారి రూ. 100 కోట్ల క్లబ్ లో చేరాడు. అదే ఏడాది రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు విడుదల అయ్యాయి. ఇక ఈ ఏడాది ఇప్పటికే ఈగల్ మూవీలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆగస్ట్ 15ని మిస్టర్ బచ్చన్ అంటూ మరోసారి థియేటర్లలో రచ్చ చేయడానికి రెడీ అయ్యాడు. మరికొన్ని సినిమాలను లైన్లో పెట్టాడు.

కాగా.. కోవిడ్ తర్వాత ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసిన హీరోగా రవితేజ టాలీవుడ్ లోనే టాప్ లో నిలిచి, బ్రేకుల్లేకుండా దూసుకెళ్తున్నాడు. ఆ తర్వాత స్థానాల్లో చిరంజీవి, ప్రభాస్, నాని తలా నాలుగు సినిమాలు విడుదల చేశారు. ఇక పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని లాంటి హీరోలు 3 సినిమాలతో మూడో స్థానంలో నిలిచారు. మరి కుర్ర హీరోల కంటే స్పీడ్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న మాస్ మహారాజాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments