iDreamPost
android-app
ios-app

Ravi Teja: బ్రేకింగ్: సంక్రాంతి రేసు నుండి తప్పుకున్న రవితేజ..!

  • Published Jan 04, 2024 | 12:55 PM Updated Updated Jan 04, 2024 | 12:55 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి సందడి మొదలైంది. నలుగురు బడా హీరోలు బాక్సాఫీసు బరిలోకి దిగుతున్న సంగతి విదితమే. మహేష్ గుంటూరు కారం, నాగార్జున నా సామి రంగ, రవితేజ ఈగల్, వెంకటేశ్ సైంధవ్ తో పాటు తేజ హనుమాన్ మూవీలతో రాబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ రేసు నుండి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి సందడి మొదలైంది. నలుగురు బడా హీరోలు బాక్సాఫీసు బరిలోకి దిగుతున్న సంగతి విదితమే. మహేష్ గుంటూరు కారం, నాగార్జున నా సామి రంగ, రవితేజ ఈగల్, వెంకటేశ్ సైంధవ్ తో పాటు తేజ హనుమాన్ మూవీలతో రాబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ రేసు నుండి..

  • Published Jan 04, 2024 | 12:55 PMUpdated Jan 04, 2024 | 12:55 PM
Ravi Teja: బ్రేకింగ్: సంక్రాంతి రేసు నుండి తప్పుకున్న రవితేజ..!

ఈ సంక్రాంతి కచ్చితంగా నిరుడు లెక్క ఉండదు అని ఇప్పటికే కన్ఫమ్ అయిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఐదు కోడి పుంజులు సంక్రాంతి రేసుకు సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. మహేష్ గుంటూరు కారాన్ని తీసుకు వస్తుంటే.. వెంకీ మామా సైంధవ్‌ మూవీతో భయపెడుతుంటే.. నాగార్జున నా సామి రంగ అంటూ రాబోతున్నాడు. మాస్ మహారాజ్ రవితేజ ఈగల్ మూవీ ఈ పండక్కి రాబోతుంది. వీటికి తోడు యంగ్ యాక్టర్ తేజ సజ్జా.. తొలి పాన్ ఇండియా మూవీ హనుమాన్ కూడా సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలకే థియేటర్లు దొరకట్లేదు అనుకుంటే.. తమిళ తంబీలు రిస్క్ చేసి మరీ.. తమ డబ్బింగ్ సినిమాలను తీసుకు వస్తున్నారు. అయలాన్, కెప్టెన్ మిల్లర్ కూడా ఈ పండుగ రేసులో ఉన్నాయి.

సంక్రాంతి బరిలో సుమారు 7-8 సినిమాలు థియేటర్లకే కాదూ.. ప్రేక్షకులను కూడా పరీక్ష పెడుతున్నాయి. ఈ కాంపిటీషన్ చూసి.. సినీ పెద్దలు కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే ఎవరి గెలుపుపై ఆ మూవీ చిత్ర యూనిట్ థీమా వ్యక్తం చేస్తుంది. అలాగే ఇప్పుడు థియేటర్ల సమస్య కష్టంగా మారింది. మహేష్ సినిమాకు థియేటర్లను బ్లాక్ చేసేశాడు నైజాం డిస్ట్రిబ్యూటర్ కమ్ నిర్మాత దిల్ రాజు. మిగిలిన హీరోలకు సింగిల్ స్క్రీన్ దొరకడం లేదు. దీంతో ఈగల్ మూవీ ఈ పరుగు పందెం నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. జనవరి 26న పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో ఆ రోజు రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈగల్ కోసం లాక్ చేసుకున్న థియేటర్లను నాగార్జున మూవీ కోసం ఇవ్వనున్నట్లు సమాచారం.

టైగర్ నాగేశ్వరరావు తర్వాత రవితేజ నుండి రాబోతున్న మూవీ ఈగల్. ఈ మూవీలో మాస్ మహారాజా మాస్,క్లాస్ లుక్స్‌లో కనిపించబోతున్నాడు. ఈ మూవీకి సినిమాటోగ్రాఫ‌ర్ కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని దర్శకుడు. గతంలో సూర్య వర్సెస్ సూర్య అనే సినిమా చేసిన అతడు.. ఆ తర్వాత కార్తికేయ, నిన్నుకోరి, అ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించాడు. మళ్లీ ఈ మూవీతో రాబోతున్నాడు. షార్ప్ షూట‌ర్ క‌థాంశంతో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, కావ్య థాప‌ర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. న‌వ‌దీప్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. దాదాపు యాభై కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని నిర్మిస్తోంది. ధమాకా తర్వాత రవితేజతో నిర్మిస్తున్న రెండవ చిత్రం ఇది. మరీ ఈ సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss