iDreamPost
android-app
ios-app

దర్శకుడి దురుసు ప్రవర్తన గురించి ప్రముఖ నటి కంటతడి!

దర్శకుడి దురుసు ప్రవర్తన గురించి ప్రముఖ నటి కంటతడి!

చిత్ర పరిశ్రమలో ఇతరుల్ని అవమానించే వారికి కొదువ లేదు. కింది స్థాయి వారిని తక్కువ చేసిచూడ్డం.. వారిని అవమానించటం మామూలే. ఇందుకు ఆడ,మగ అన్న తేడాలు ఉండవు. ముఖ్యంగా దర్శకులు.. నటీమణుల పట్ల దురుసుగా ప్రవర్తించిన సంఘటన చాలానే చోటు చేసుకున్నాయి. ప్రముఖ నటి రతి పాండే తనకు ఓ దర్శకుడి కారణంగా ఎదురైన దారుణమైన అనుభవం గురించి తాజాగా చెప్పుకొచ్చారు. ఆమె ఓ ప్రముఖ నేషనల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ‘‘ నేను ఆ షో పేరు చెప్పాలనుకోవటం లేదు. నేను ఓ పౌరాణిక సీరియల్‌ చేశాను.

ఆ సీరియల్‌ కోసం స్వచ్ఛమైన హిందీ మాట్లాడ్డం మొదలుపెట్టాను. అది నాకు ఓ అలవాటుగా మారింది. అలాంటి సమయంలో సడెన్‌గా నాకో కొత్త సీరియల్‌ ఆఫర్‌ వచ్చింది. నేను ఆ సీరియల్‌ కోసం ప్రిపేర్‌ అయ్యే అవకాశం లేకపోయింది. ఆ క్యారెక్టర్‌ను బయట పడలేకపోయాను. నిజానికి ఆ సీరియల్‌ దర్శకుడు నా స్థానంలో ఓ నటి కోసం బాగా ప్రయత్నించాడు. కానీ, ఆమె చేయటం కుదరలేదు. ప్రొడక్షన్‌ హౌస్‌, ఛానల్‌ కారణంగా నన్ను సీరియల్‌లోకి తీసుకున్నాడు. ఓ సారి షూటింగ్‌ సమయంలో నేను ఓ డైలాగ్‌ తప్పుగా చెప్పాను.

అంతే! ఆయన నా మీద విరుచుకుపడ్డాడు. అందరి ముందు నన్ను దారుణంగా మాటలు అన్నాడు. నేను వివరణ ఇవ్వటానికి కూడా అవకాశం లేదు. ఆ తర్వాత కూడా చాలా సార్లు నా నటన మీద కామెంట్లు చేస్తూ వచ్చాడు. నాకు చాలా బాధేసేది. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నాకు అసలు యాక్టింగ్‌ రాదా అనుకునేదాన్ని. అయినా.. ఎప్పుడూ వెనక్కు తగ్గలేదు. ఓ రోజు అతడికి గుడ్‌ బై చెప్పి.. సీరియల్‌నుంచి తప్పుకున్నా ’’ అని అన్నారు. మరి, రతి పాండేకు ఎదురైన ఈ చేదు అనుభవంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.