iDreamPost
android-app
ios-app

Rashmika: రష్మిక డేరింగ్ స్టేట్మెంట్.. వారిని పట్టించుకోను అంటూ..!

  • Published Feb 05, 2024 | 8:35 PM Updated Updated Feb 05, 2024 | 8:35 PM

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో గత ఏడాది బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకున్న "యానిమల్" చిత్రం గురించి ఇప్పటికి టాక్ నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మీక.. సినిమా గురించి, సినిమాలో తన పాత్ర గురించి పలు వ్యాఖ్యలు చేశారు.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో గత ఏడాది బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకున్న "యానిమల్" చిత్రం గురించి ఇప్పటికి టాక్ నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మీక.. సినిమా గురించి, సినిమాలో తన పాత్ర గురించి పలు వ్యాఖ్యలు చేశారు.

  • Published Feb 05, 2024 | 8:35 PMUpdated Feb 05, 2024 | 8:35 PM
Rashmika: రష్మిక డేరింగ్ స్టేట్మెంట్.. వారిని పట్టించుకోను అంటూ..!

గత ఏడాది డిసెంబర్ 1న విడుదల అయిన యానిమల్ సినిమా చేసిన రచ్చ అంత ఇంత కాదు. ఆ సమయంలో ఎక్కడ చూసిన ప్రేక్షకులంతా యానిమల్ మూవీ ఇచ్చిన కిక్ లోనే ఉన్నారు. అంతేకాకుండ ఈ సినిమా కారణంగా కొన్ని వివాదాలు కూడా రాచుకున్నాయి. ఏదేమైనా యానిమల్ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ .. తెలుగు వారి సత్తాను బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేశాడు. యానిమల్ క్రియేట్ చేసిన హైప్ తో .. మూవీ మేకర్స్ యానిమల్ సిక్వెన్స్ ది యానిమల్ పార్క్ ను రూపొందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రంలో రణ్ బీర్ కపూర్, రష్మిక , బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే, ఈ సినిమా భారీ సక్సెస్ తర్వాత జరిగిన పలు ఇంటర్వ్యూలలో హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ .. సినిమాలోని కొన్ని హింసాత్మకమైన సన్నివేశాలపై స్పందించారు.

యానిమల్ సినిమాలో గీతాంజలి పాత్రలో రష్మీక చాలా అద్భుతంగా నటించారు. పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది రష్మీక. దీనితో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే, తాజాగా యానిమల్ సినిమా గురించి మాట్లాడుతూ .. రష్మిక ఇలా చెప్పుకొచ్చారు. “నటి నటులు వారి పాత్రలకు వంద శాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తారు. సినిమాను ఆదరించాల వద్దా అనేది ప్రేక్షకుల మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో రణ్ బీర్ పాత్ర .. భార్యకు, కుటుంబానికి ఎంతో గౌరవాన్ని ఇస్తుంది. తన వాళ్ళను కాపాడుకునేందుకు ఎంత సాహసమైన చేయడానికి సిద్దపడతాడు. ఆడియన్సుకు ఆ పాత్ర కచ్చితంగా నచ్చాలని రూల్ ఏమి లేదు. అది పూర్తిగా ఆడియన్సు అభిరుచి. ఆ విషయం నేను పట్టించుకోను. ఈ సినిమాను ఎంతో మంది ఆదరించారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ” అంటూ చెప్పారు.

అలాగే, సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ.. “నేను దర్శకుడి ఊహకు ప్రాణం పోయాలి అనుకునే నటిని. ఆయన చెప్పినట్లు చేయడమా నా కర్తవ్యం. సన్నివేశం బాగా వచ్చేవరకు ఎన్ని టేకులైన చేస్తాను. ఈ సినిమాలో గీతాంజలి చాలా ధైర్యవంతురాలు. నిజ జీవితంలో కూడా ఇలా జీవించేవారిని చాలా మందిని చూశాను. వాళ్ళకోసం ఈ పాత్రను స్వేచ్ఛతో చేశాను”. అంటూ చెప్పుకొచ్చారు రష్మిక. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉంది. దానితో పాటు మరో మూడు ప్రాజెక్టులు కూడా వరుసలో ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా , ఈ పాత్ర చేస్తే ఆడియన్స్ ఏమనుకుంటారో.. ఆ పాత్ర చేస్తే ఏమనుకుంటారో అని భయపడను.. నా 100 శాతం ఇవ్వడానికి ట్రై చేస్తాను అనే విధంగా .. రష్మిక చెప్పడం నిజంగా చాలా డేరింగ్ స్టేట్మెంట్ అనే చెప్పాలి. మరి, రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet Giriş