iDreamPost
android-app
ios-app

‘కుబేర’ నుంచి రష్మిక ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్

  • Published Jul 05, 2024 | 3:25 PM Updated Updated Jul 05, 2024 | 3:25 PM

Kubera Movie: తెలుగు ఇండస్ట్రీలోకి ‘ఛలో’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన తర్వాత వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా ఎందిగింది.అంతేకాదు ఈ అమ్మడు పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

Kubera Movie: తెలుగు ఇండస్ట్రీలోకి ‘ఛలో’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన తర్వాత వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా ఎందిగింది.అంతేకాదు ఈ అమ్మడు పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

  • Published Jul 05, 2024 | 3:25 PMUpdated Jul 05, 2024 | 3:25 PM
‘కుబేర’ నుంచి రష్మిక ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్

ఇప్పటి వరకు టాలీవుడ్ లోకి ఎంతోమంది ఇతర భాష హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా కన్నడ, మలయాళ, హిందీ భాషల నుంచి ఎంతోమంది హీరోయిన్లు తెలుగు లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందులో కొంతమంది స్టార్ హీరోయిన్లుగా ఒక్క వెలుగు వెలిగిపోయారు. నాగశౌర్ హీరోగా నటించిన ‘ఛలో’ మూవీతో కన్నడ బ్యూటీ రష్మిక మందన తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకుంది. పుష్ప, యానిమల్ మూవీస్ తో పాన్ ఇండియా హీరోయిన్ గా తన సత్తా చాటింది. తాజాగా రష్మిక నటించిన కుబేర మూవీకి సంబంధించిన గ్లింప్ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

కన్నడ బ్యూటీ రష్మీక మందన.. అభిమానులు ముద్దుగా నేషనల్ క్రష్ గా పిలుస్తారు. కన్నడ ఇండస్ట్రీలో ‘కిరిక్ పార్టీ’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  టాలీవుడ్ లోకి  ‘ఛలో’ మూవీతో తొలిపరిచయం అయ్యింది.  విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో ఈ అమ్మడికి వరుస ఛాన్సులు వచ్చాయి. ఇక సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యానిమల్’ మూవీస్ తో ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంది. నేషనల్ అవార్డు విన్నర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న మూవీ ‘కుబేర’. ఈమూవీలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున తో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన నటిస్తున్నారు. ఈ మూవీ హైలీ యాంటిసిపేటెడ్ సోషల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రష్మిక నటించిన ‘కుబేర’ మూవీ గ్లింప్ రిలీజ్ చేశారు. ఇందులో రష్మిక మందన నిర్మాణుష్యంగా ఉన్న అటవీ ప్రాంతంలో గడ్డపారతో ఎంట్రీ ఓ గొయ్యి తవ్వి అందులో నుంచి ఓ పెద్ద సూట్ కేసు ని బయటకు తీసింది. ఆ సూట్ కేసు ని ఓపెన్ చేయగా అందులో పెద్ద మొత్తంలో డబ్బు ఉంది. ఆ డబ్బు చూసి తెగ సంతోషపడుతూ సూట్ కేసు తీసుకొని బయలు దేరింది. మొత్తానికి ఆ మూవీ డబ్బు చుట్టు తిరుగుతందని అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీలో రష్మిక చాలా డిఫరెంట్ లుక్ తో కనిపిస్తుంది. పాన్ ఇండియా మల్టీ లాంగ్వేజ్ మూవీ కుబేర తమిళం, తెలుగులో ఏక కాలంలో షూటింగ్ చేస్తున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş