iDreamPost

రానాకి సెల్యూట్ చేస్తున్న తెలుగు సినిమా ఫ్యాన్స్! ఇంత నిస్వార్ధం ఎలా స్వామి?

Rana's Quest Towards Tollywood: రానా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉంటారు. గర్వం లేని వ్యక్తిత్వం. స్వార్థం ఎరుగని మనస్తత్వం. అలాంటి రానా తెలుగు సినిమా కోసం పడుతున్న తపనకు ఫ్యాన్స్ సెల్యూట్ చేస్తున్నారు.

Rana's Quest Towards Tollywood: రానా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉంటారు. గర్వం లేని వ్యక్తిత్వం. స్వార్థం ఎరుగని మనస్తత్వం. అలాంటి రానా తెలుగు సినిమా కోసం పడుతున్న తపనకు ఫ్యాన్స్ సెల్యూట్ చేస్తున్నారు.

రానాకి సెల్యూట్ చేస్తున్న తెలుగు సినిమా ఫ్యాన్స్! ఇంత నిస్వార్ధం ఎలా స్వామి?

తెలుగు సినిమా ఇవాళ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో సత్తా చాటుతుంది. టాలీవుడ్ కూడా భారతీయ సినిమాలో ఒక భాగమైపోయింది. ఇంతలా తెలుగు సినిమాకి గుర్తింపు తీసుకురావడంలో రాజమౌళి సహా చాలా మంది డైరెక్టర్లు, హీరోలు, నిర్మాతలు కీలక పాత్ర పోషించారు. వీరంతా తెలుగు సినిమాకి గుర్తింపు తీసుకురావాలని ఎంతో తాపత్రయపడ్డారు. బాలీవుడ్, టాలీవుడ్ గీత చెరిపేయడం కోసం చాలా చాలా కృషి చేశారు. నార్త్, సౌత్ తేడాలు చెరిపేయాలని ఎంతో ప్రయత్నించారు. అయితే వీరి కంటే ముందే ఈ గీత చెరిపేయడానికి ఒక హీరో బాలీవుడ్ కి పయనమయ్యాడు. నార్త్, సౌత్ కాదు.. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలు కాదు.. మనది భారతీయ సినిమా, మనం భారతీయ నటులం అని చెప్పడానికి సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఒక హీరో బయలుదేరాడు. అతనే రానా దగ్గుబాటి. 

లీడర్ సినిమాతో క్లాస్ హిట్ కొట్టిన రానా.. ఆ తర్వాత వెంటనే బాలీవుడ్ లో దమ్ మారో దమ్ అనే మూవీలో నటించాడు. ఆ తర్వాత కూడా డిపార్ట్మెంట్, ఏ జవానీ హై దివానీ, బేబీ సినిమాల్లో నటించారు. తన కలుపుగోలుతనంతో అక్కడ వారితో కలిసిపోయాడు. ఆ తర్వాత ‘ది ఘాజి ఎటాక్’ సినిమాతో తెలుగు సినిమాని బాలీవుడ్ వారికి పరిచయం చేశాడు. ఆ తర్వాత బాహుబలి రావడం.. రానా క్రేజ్ మరింత పెరిగిపోవడం జరిగిపోయింది. ఇవేమీ లేకుండానే రానా ఎప్పుడో బాలీవుడ్ లో తానేంటో నిరూపించుకున్నాడు. అయితే తాను నటించిన సినిమాలే కాకుండా నటించకపోయినా కూడా సినిమాలకు దగ్గరుండి ప్రమోట్ చేయడం రానాతో ఉన్న గొప్ప క్వాలిటీ.

ఆ మధ్య హనుమాన్ సినిమాని బాలీవుడ్ కి పరిచయం చేసింది రానానే. హనుమాన్ మూవీని హనుమంతుడిలా అక్కడి మీడియాలోకి, జనాల్లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు కల్కి సినిమా ప్రమోషన్ కోసం రానా బాలీవుడ్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఇలా తెలుగు సినిమా కోసం.. తెలుగు సినిమాని బాలీవుడ్ లోకి తీసుకెళ్లడం కోసం తన, మన తేడా లేకుండా పని చేస్తారు. తాను నటించిన సినిమా అయినా, వేరే నటులు నటించినా సినిమా అయినా అది తెలుగు సినిమా అయితే చాలు మోయడానికి నేనున్నా అంటూ భుజం కాస్తాడు. మన వాళ్ళకి, అక్కడి వాళ్ళకి అవసరం ఉందంటే చాలు ఎలాంటి ఈగో లేకుండా వాలిపోతారు. తెలుగు సినిమా బాగు కోరుకునే వారిలో రానా ఎప్పుడూ ముందే ఉంటారు. దానికిదే సాక్ష్యం. మరి ఈ విషయంలో మీరేమంటారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి