iDreamPost
android-app
ios-app

Rana Daggubati: ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర సినిమా రూపంలో.. ఆ పాత్రలో రానా !

  • Published Jun 10, 2024 | 10:28 AM Updated Updated Jun 10, 2024 | 10:28 AM

బయోపిక్స్ ... అంటే గొప్ప గొప్ప వారి జీవిత చరిత్రలను ఆధారంగా తీసుకుని.. సినిమాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రను.. తెరమీద చూపించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

బయోపిక్స్ ... అంటే గొప్ప గొప్ప వారి జీవిత చరిత్రలను ఆధారంగా తీసుకుని.. సినిమాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రను.. తెరమీద చూపించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Jun 10, 2024 | 10:28 AMUpdated Jun 10, 2024 | 10:28 AM
Rana Daggubati: ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర  సినిమా రూపంలో.. ఆ పాత్రలో రానా !

ఈ మధ్య కాలంలో బయోపిక్స్ సినిమాలకు బాగా క్రేజ్ పెరుగుతుంది. ఇప్పటికే వెండి తెరపైన చాలా మంది జీవిత చరిత్రలను ఎంతో అద్భుతంగా చూపించారు మేకర్స్. వారిలో ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల జీవిత కథలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు మరొక వీరుడి కథ వెండి తెరపైన చూపించడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. టాలీవుడ్ లోనే కాకుండా.. బాలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ బాగానే కనిపిస్తుంది. బాలీవుడ్ లో.. అక్షయ్ కుమార్ , అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరోస్ నటించిన.. సామ్రాట్ పృథ్వీరాజ్, తానాజీ, పానిపట్, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ లాంటి ఎన్నో సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇక ఇప్పుడు ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర తెరపైన వచ్చేందుకు రెడీ అయిపోతుంది. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

ఛత్రపతికి శివాజీ జీవిత చరిత్ర “శివాజీ” పేరుతో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని బీ టౌన్ లో టాక్ వినిపిస్తుంది. ఇక ఛత్రపతి శివాజీ పాత్రను షాహిద్ కపూర్ పోషించనున్నారు. ఈ సినిమాను అమిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలో ఔరంగజేబు పాత్రలో ప్రముఖ టాలీవుడ్ స్టార్ యాక్టర్ నటిస్తున్నాడట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు.. బాహుబలి సినిమాలో.. బల్లాల దేవగా అద్భుతంగా అలరించిన రానా దగ్గుబాటి.. ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాడని భావిస్తున్నారట మేకర్స్. అందుకోసం చర్చలు జరుగుతున్నాయట. ఇప్పటికే ఈ విషయంపై రానాను సంప్రదించినట్లు తెలుస్తుంది.

ఇక బాహుబలి, భీమ్లా నాయక్ సినిమాలలో తప్ప మరే సినిమాలలోనూ రానా విలన్ పాత్రలో నటించలేదు. అయితే మరి ఇప్పుడు బాహుబలి సినిమాలో విలన్ పాత్రలో నటించేందుకు రానా ఒప్పుకుంటారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇక షాహిద్ కపూర్ విషయానికొస్తే.. ఈ హీరో పద్మావత్ సినిమాలో రాజా రతన్ సింగ్ గా నటించాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో ఛత్రపతి శివాజీ పాత్రలో నటించనున్నాడు. అలాగే రంగూన్ అనే సినిమాలోను నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఈ సినిమాకు సంబంధిచిన మరిన్ని విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.