Krishna Kowshik
మెగాస్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. వేల్స్ యూనివర్శిటీ ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసింది.
మెగాస్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. వేల్స్ యూనివర్శిటీ ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసింది.
Krishna Kowshik
మెగా స్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన ఇప్పుడు మెగా పవర్ స్టార్ కాదు.. డాక్టర్ రామ్ చరణ్. అవును చెర్రీకి డాక్టరేట్ ప్రదానం చేసింది చెన్నైలోని వేల్స్ యూనివర్శిటీ. 14వ కాన్వకేషన్‌లో ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ ఏడాదికిగానూ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో సేవలు అందించినందుకు చెర్రీకి వేల్స్ యూనిర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను అందచేసింది. ఈ కార్యక్రమం ఏప్రిల్ 13న జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. చిరుత మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు రామ్ చరణ్.
ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్ చేస్తున్నాడు చరణ్. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల ఆయన పుట్టిన రోజు పురస్కరించుకుని జరగండి జరగండి పాటను కూడా రిలీజ్ చేశారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ ఏడాది గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది. ఇదే కాకుండా బుచ్చిబాబుతో ఓ సినిమా షురూ చేశాడు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయిక. అలాగే రంగ స్థలం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిిన కాంబో మళ్లీ రిపీట్ కాబోతుంది. లెక్కల మాస్టారు సుక్కు డైరెక్షన్ లో మరో సినిమా షురూ అయ్యింది. ఈ రెండు ప్రాజెక్టులు అయిపోయాక.. ఇది పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చెర్రీకి డాక్టరేట్ ప్రదానం చేస్తున్నారని వార్త రాగానే.. అభిమానులు ఉబ్బితబ్బిబ్బు అయిపోయారు. ఈ అవార్డును తీసుకునేందుకు సతీసమేతంగా చెన్నై వెళ్లాడు చెర్రీ. ఆయన లుక్స్ కూడా వైరల్ అయ్యాయి. ఇటీవల తండ్రిగా ప్రమోట్ అయిన చెర్రీ.. ఇప్పుడు అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. ఈ వేడుకలో రామ్ చరణ్‌తో పాటు డా.పి.వీరముత్తువేల్ (ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ చంద్రయాన్, ఇస్రో), డా జీఎస్కే వేలు (ఫౌండర్, సీఎండి ట్రివిట్రోన్ హెల్త్ కేర్), అచంట శరత్ కమల్ (పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, ప్రముఖ టేబుల్ టెన్నిల్ ప్లేయర్)లను కూడా డాక్టరేట్‌తో గౌరవించారని సమాచారం.
#RamCharan was conferred the Degree of Doctorate of Literature (honoris causa) at the 14th Annual Convocation of VELS University, Chennai. pic.twitter.com/wG4QFXTzZS
— Gulte (@GulteOfficial) April 13, 2024