iDreamPost
android-app
ios-app

Double Ismart Day 2 Collections: నిరాశ పరిచిన డబుల్ ఇస్మార్ట్ డే 2 కలెక్షన్లు! ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

  • Published Aug 17, 2024 | 8:52 AM Updated Updated Aug 17, 2024 | 8:52 AM

తొలిరోజు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన రామ్ పోతినేని, రెండో మాత్రం నిరాశపరిచాడు. డబుల్ ఇస్మార్ట్ మూవీకి మిక్స్ డ్ టాక్ రావడంతో.. సెకండ్ డే కలెక్షన్లు భారీగా పడిపోయాయి. రెండో రోజు ఈ సినిమా ఎన్నికోట్లు రాబట్టిందంటే?

తొలిరోజు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన రామ్ పోతినేని, రెండో మాత్రం నిరాశపరిచాడు. డబుల్ ఇస్మార్ట్ మూవీకి మిక్స్ డ్ టాక్ రావడంతో.. సెకండ్ డే కలెక్షన్లు భారీగా పడిపోయాయి. రెండో రోజు ఈ సినిమా ఎన్నికోట్లు రాబట్టిందంటే?

Double Ismart Day 2 Collections: నిరాశ పరిచిన డబుల్ ఇస్మార్ట్ డే 2 కలెక్షన్లు! ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 15న డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ట్రైలర్, సాంగ్స్ మాస్ ఆడియెన్స్ ను పిచ్చెక్కించడంతో.. ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీ తొలిరోజు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. రామ్ కెరీర్ లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే రెండో రోజు మాత్రం షాకింగ్ వసూళ్లను నమోదు చేసి, నిరాశ పరిచింది. సెకండ్ డే రామ్ ఎన్ని కోట్లు వసూళ్ చేశాడో తెలుసుకుందాం పదండి.

రామ్ డబుల్ ఇస్మార్ట్ మూవీకి ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ తొలిరోజు భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. ఫస్ట్ డేనే తెలుగు రాష్ట్రాల్లో రూ. 7 కోట్లు, ఇండియా వైడ్ గా రూ. 8.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా మెుదటిరోజు రూ. 12.45 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. రామ్ కెరీర్ లోనే మాసీవ్ కలెక్షన్స్ గా నిలిచాయి. అయితే రెండో రోజు కూడా ఇదే జోరు కోనసాగుతుందని ట్రేడ్ వర్గాలు, అభిమానులు భావించారు. కానీ అనూహ్యంగా వసూళ్లు పడిపోయాయి. థియేట్రికల్ ఆక్యూపెన్సీ విషయంలో భారీగా డ్రాప్ అయ్యింది.

DS Day2 Collections

ఇక డబుల్ ఇస్మార్ట్ సెకండ్ డే కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఆంధ్రాలో రూ. 1.75 కోట్లు, తమిళ, కన్నడ, ఇతర ఏరియాల్లో కలుపుకొని రూ. 50 లక్షల నికర వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా రూ. 2.25 కోట్ల షేర్ ను సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ ను కలుపుకొని ఈ చిత్రం రెండో రోజు రూ. 3.4 నుంచి రూ. 4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా రెండో రోజు డబుల్ ఇస్మార్ట్ రూ. 16 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ. 54 కోట్ల షేర్ సాధించాల్సి ఉంది. వీకెండ్ ఉండటంతో.. బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి రెండో రోజు డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్లు నిరాశ పరచడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.