iDreamPost
android-app
ios-app

తమిళ స్టార్ డైరెక్టర్స్ ని కలిసిన రామ్ చరణ్! పెద్ద ప్లాన్ ఏమైనా జరుగుతోందా?

  • Author ajaykrishna Updated - 08:55 AM, Fri - 18 August 23
  • Author ajaykrishna Updated - 08:55 AM, Fri - 18 August 23
తమిళ స్టార్ డైరెక్టర్స్ ని కలిసిన రామ్ చరణ్! పెద్ద ప్లాన్ ఏమైనా జరుగుతోందా?

ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్.. గ్లోబల్ రేంజ్ కి చేరుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుండి చరణ్ కి సంబంధించి తదుపరి సినిమాలపై ఫుల్ ఫోకస్ పెడుతున్నారు ఫ్యాన్స్. ఏయే దర్శకులతో ఎలాంటి సినిమాలు లైనప్ చేస్తున్నాడు అనేది ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అయితే.. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్.. అగ్రదర్శకుడు శంకర్ తో ‘గేమ్ చేంజర్’ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా.. వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు ప్రొడ్యూసర్ దిల్ రాజు. వీలైనంత గ్రాండియర్ గా సినిమా రూపొందిస్తున్నారని టాక్.

ఈ క్రమంలో తాజాగా రామ్ చరణ్.. తమిళ స్టార్ డైరెక్టర్స్ అందరితో కలిసి ఓ పార్టీలో మెరిశాడు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే.. ఇదేం పార్టీ? రామ్ చరణ్ కోలీవుడ్ డైరెక్టర్స్ ని ఎందుకు కలిసాడు? అంటూ సోషల్ మీడియాలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే.. డైరెక్టర్ శంకర్ పుట్టినరోజు కారణంగా ఈ మీట్ జరిగింది. గేమ్ చేంజర్ సెట్ లో బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్న శంకర్.. ఆ తర్వాత చెన్నైలో స్పెషల్ పార్టీ అరేంజ్ చేశాడు. ఈ పార్టీకి లోకేశ్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజ్, గౌతమ్ వాసుదేవ్ మేనన్,‍ వెట్రిమారన్, వెంకట్ ప్రభు, ఎస్‌జే సూర్య లాంటి స్టార్ డైరెక్టర్స్ మధ్యలో రామ్ చరణ్ కనిపించాడు.

దీంతో ఈ పార్టీ శంకర్ బర్త్ డేకి సంబంధించినదే అయినా.. అక్కడ అంతమంది ఫామ్ లో ఉన్న డైరెక్టర్స్ కనిపిస్తున్నారు. సో.. ఎవరైనా చరణ్ తో నెక్స్ట్ మీట్ కి ప్లాన్ చేయొచ్చు లేదా స్టోరీ లైన్ చెప్పేందుకు ట్రై చేసి ఉండొచ్చు. ఇవేవి కాదనుకుంటే త్వరలో ఏదొక డైరెక్టర్ తో కొత్త సినిమా ప్లాన్ జరగవచ్చు అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే.. గేమ్ చేంజర్ తర్వాత చరణ్.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడు. అనంతరం.. రామ్ చరణ్.. లోకేష్ కనగరాజ్ తో చేయబోతున్నాడని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ కాంబినేషన్ ఫిక్స్ అయినా ఆశ్చర్యపోయే అవసరం లేదు. మరి రామ్ చరణ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommarsbahisMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/