iDreamPost
android-app
ios-app

Ram Charan: రామ్ చరణ్ కీలక నిర్ణయం.. ఇక ఫ్యాన్స్ కు పండగే!

  • Published Sep 13, 2024 | 2:23 PM Updated Updated Sep 13, 2024 | 2:23 PM

Ram Charan will do films without a gap: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన రూటు మార్చినట్లు తెలుస్తోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి వస్తున్న ఓ సమస్యకు చెక్ పెడుతూ.. ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Ram Charan will do films without a gap: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన రూటు మార్చినట్లు తెలుస్తోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి వస్తున్న ఓ సమస్యకు చెక్ పెడుతూ.. ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Sep 13, 2024 | 2:23 PMUpdated Sep 13, 2024 | 2:23 PM
Ram Charan: రామ్ చరణ్ కీలక నిర్ణయం.. ఇక ఫ్యాన్స్ కు పండగే!

రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఇక ఈ చిత్రంతో వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకున్నాడు చెర్రీ. అయితే చరణ్ ను కెరీర్ స్టార్టింగ్ నుంచి ఓ సమస్య వెంటాడుతూ వస్తోంది. ఆ సమస్య నుంచి ఎంత దూరంగా వెళ్దామన్నా అతడికి కుదరడం లేదు. అయితే ఇక నుంచి ఆ ప్రాబ్లెమ్ కు చెక్ పెట్టడానికి సరికొత్త ప్లాన్స్ తో బరిలోకి దిగుతున్నాడట ఈ మెగావారసుడు. అందుకోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక చరణ్ తీసుకున్న డెసిషన్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి చెర్రీ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన రూటు మార్చినట్లు తెలుస్తోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి సినిమాకు సినిమాకు మధ్యలో గ్యాప్ తీసుకుంటూ వస్తున్నాడు చరణ్. తన తొలి సినిమా చిరుత తర్వాత రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకుని మగధీరతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే కెరీర్ స్టార్టింగ్ కాబట్టి ఆచి తూచి అడుగులు వేశాడు. ఇక ఆ తర్వాత దాదాపు సంవత్సరానికి ఓ సినిమా చొప్పున చేస్తూ వచ్చాడు. దాంతో తన సమస్య తీరిపోయిందనుకున్నాడు. కానీ..  2019లో వచ్చిన వినయ విధేయ రామ తర్వాత మళ్లీ ఆర్ఆర్ఆర్ వచ్చే వరకు గ్యాప్ తీసుకున్నాడు. RRR చిత్రం 2022లో వచ్చింది. ఈ సినిమా తర్వాత మళ్లీ  ఇప్పటి వరకు చరణ్ మూవీ రిలీజ్ కాలేదు. ప్రస్తుతం శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘గేమ్ ఛేంజర్’ క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతోంది.

ఇదిలా ఉండగా.. ఇప్పటి నుంచి తనలో మరో రామ్ చరణ్ ను చూస్తారని, గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు తీస్తానని రామ్ చరణ్ అంటున్నాడు. అందులో భాగంగానే గేమ్ ఛేంజర్ రిలీజ్ అవ్వక ముందే బుచ్చిబాబు డైరెక్షన్ లో RC16 ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ఇది తెరకెక్కనుంది. ఇక ఈ చిత్రంతో పాటుగానే సుకుమార్ దర్శకత్వంలో మరో మూవీ చేయబోతున్నాడు చెర్రీ. పుష్ప 2 డిసెంబర్ 6న రిలీజ్ అయిన తర్వాత సుక్కు ఫ్రీ అవుతాడు. దాంతో వీరిద్దరి ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. బుచ్చి బాబు-సుకుమార్ ప్రాజెక్ట్ లను ఒకేసారి పూర్తి చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు చరణ్ సన్నిహితులు. ఈ రెండు సినిమాలను 2026 లోపే రిలీజ్ చేయాలని చెర్రీ భావిస్తున్నాడట. వీటితో పాటుగా మరికొంత మంది డైరెక్టర్లు చరణ్ కోసం కథలు పట్టుకుని రెడీగా ఉన్నారు. దాంతో త్వరలోనే వరుసగా చెర్రీ అప్ కమింగ్ ప్రాజెక్ట్ లు వచ్చే సూచనలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరో సినిమాలు వెంటవెంటనే థియేటర్లలోకి వస్తాయని హ్యాపీ అవుతున్నారు. మరి ఇక నుంచి గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్న రామ్ చరణ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ