Mathu Vadalara 2 Movie Review & Rating In Telugu: కీరవాణి కొడుకు శ్రీ సింహ హీరోగా 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘మత్తు వదలరా’. అప్పట్లో మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీకి సీక్వెల్ గా ‘మత్తు వదలరా 2' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ‘మత్తు వదలరా 2' మూవీ ఎలా ఉందో.. ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
Mathu Vadalara 2 Movie Review & Rating In Telugu: కీరవాణి కొడుకు శ్రీ సింహ హీరోగా 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘మత్తు వదలరా’. అప్పట్లో మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీకి సీక్వెల్ గా ‘మత్తు వదలరా 2' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ‘మత్తు వదలరా 2' మూవీ ఎలా ఉందో.. ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
Raj Mohan Reddy
కీరవాణి కొడుకు శ్రీ సింహ హీరోగా 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘మత్తు వదలరా’. అప్పట్లో మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీకి సీక్వెల్ గా ‘మత్తు వదలరా 2′ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ‘మత్తు వదలరా 2′ మూవీ ఎలా ఉందో.. ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
మత్తు వదలరా మొదటి పార్ట్ కి సరైన కొనసాగింపుగా మత్తు వదలరా 2 ని తెరకెక్కించారు. ఫస్ట్ పార్ట్ లో అంత పెద్ద డ్రగ్ మాఫియాని పట్టించినా బాబు (శ్రీ సింహ) ఏసుదాసు (సత్య) జీవితాల్లో పెద్దగా మార్పు రాదు. పైగా.. ఆ డెలివరీ ఏజెంట్ ఉద్యోగం కూడా పోయి.. రోడ్డుపై పడతారు. ఇలాంటి సమయంలో అనుకోకుండా హాయ్ ఎమర్జెన్సీ టీమ్స్ రిక్రూట్మెంట్ జరుగుతుంది అని తెలిసి.. లంచం ఇచ్చి పోలీసులుగా మారతారు. అయితే.., ఇక్కడ కూడా వచ్చే జీతం సరిపోక.. కిడ్నాప్ కేసుల్లో కొంత డబ్బుని తస్కరించడం అలవాటుగా మార్చుకుంటారు. ఈ అలవాటు కారణంగానే వీరు ఆకాష్(అజయ్) మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. అయితే అసలు ఈ ఆకాష్ ఎవరు? అతని హత్యకి కారణం ఏమిటి? ఈ కేసులో బాబుని, ఏసుని ఇరికించాలి అనుకుంది ఎవరు? ఈ మొత్తం క్రైమ్ నుండి వీరు ఎలా బయట పడ్డారు అన్నదే మత్తు వదలరా 2 కథ.
ఏ సినిమాకైనా కథ ప్రాణం అంటూ ఉంటారు. అది నిజం కూడా. కానీ.., ఒక్కోసారి ఆ కథలోని పాత్రలు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లిపోతుంటాయి. కథ, కథనాన్ని దాటి ఆ క్యారెక్టర్స్ షైన్ అవుతుంటాయి. “మత్తు వదలరా2” విషయంలో కూడా ఇలాంటి మ్యాజిక్కే జరిగింది. ఆ మ్యాజిక్ పేరు సత్య. ఏసు పాత్రలో సత్య నటించిన తీరు.. సినిమాని నిలబెట్టేసింది. కథ, కథనం ఎలా సాగిపోతున్నా.. ఫ్రేమ్ లోకి సత్య వచ్చిన ప్రతిసారి నవ్వులు కురిశాయి. అతని మాట, నడక, నటన, ఆఖరికి మౌనం కూడా.. ప్రేక్షకులను గిలిగింతలు పెట్టేశాయి. ఇంత పెద్ద మేజర్ ప్లస్ నడుమ.. సినిమాలోని కొన్ని కొన్ని మైనస్ లు మరుగున పడిపోయాయి. కాకపోతే.. కొన్ని సీక్వెన్స్ ల్లో ల్యాగ్ ఉండటం.. కొంత నిరాశ కలిగించే అంశం.
పార్ట్1 కంటిన్యుటీ మిస్ కాకుండా.. ప్రేక్షకులను ఈ కథలోకి తీసుకొని రావడంలో దర్శకుడు బాగా సక్సెస్ అయ్యాడు. దీంతో.. బాబు, ఏసు క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ కోసం పెద్దగా సమయం అవసరం లేకుండా పోయింది. ఇక ఇక్కడ నుండి స్టోరీ పోగ్రెషన్ కి కావాల్సిన కొన్ని సీక్వెన్స్ లు వస్తూ, పోతుంటాయి. ఆ సన్నివేశాల్లో పెద్దగా బలం లేకున్నా.. సత్య కామెడీతో సినిమా సజావుగానే సాగుతున్న ఫీల్ వస్తుంది. ఇక కథలో కిడ్నాప్ సీక్వెన్స్ మొదలైన దగ్గర నుండే సినిమాలో స్పీడ్ పెరుగుతుంది. పైగా.. ఇక్కడ నుండి శ్రీ సింహ నటనలోనూ మంచి మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఇక ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్లాక్ అన్నిట్లో ట్విస్ట్ లు బాగా పేలడం, దీనికి కామెడీ యాడ్ ఆన్ కావడంతో మత్తు వదలరా 2 మంచి కిక్ ఇచ్చే మూవీ అనిపిస్తుంది.
మత్తు వదలరా 2 సెకండ్ ఆఫ్ కి వచ్చేసరికి సినిమా స్థాయి కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. కేసులో ఇరుక్కున్న తర్వాత దాని నుండి బయటకు రావడానికి బాబు, ఏసు చేసే ప్రయత్నాలు చాలా రిపీటెడ్ గా అనిపిస్తాయి. దీంతో.. కథ ముందుకు సాగని ఫీల్ వస్తుంది. కాకపోతే.. ఇదే సన్నివేశాల్లో కామెడీ మాత్రం వర్కౌట్ అవుతూనే వస్తూ ఉంటుంది. కాకపోతే.. సీరియస్ గా కథ చెప్పాల్సిన దగ్గర కూడా ల్యాగ్ రావడంతో కాస్త బోర్ కొట్టిన ఫీల్ వస్తుంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్ కోసం సాగే యాక్షన్ సీక్వెన్స్ అంత కథకి అనవసరంగా చూపించినట్టు అనిపిస్తుంది. ఇక అక్కడ నుంచి ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతూ వచ్చినా.. క్రమంగా కామెడీ లెవల్ పడిపోతూ వస్తుంది. అక్కడ పడిపోయిన గ్రాఫ్ లో మళ్ళీ క్లైమాక్స్ లో సత్య పుణ్యమా అంటూ కాస్త పైకి లేస్తుంది. అక్కడక్కడ ఉండే ఈ ల్యాగ్ కారణంగా మత్తు వదలరా 2 స్థాయి కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది.
నో డౌట్,.. ఈ సినిమాలో ముందుగా మెచ్చుకోవాల్సింది సత్యనే. టోటల్ వన్ మ్యాన్ షో ఇది. ఇంత మంచి కమెడియన్ ని ఇండస్ట్రీ సరిగ్గా ఎందుకు వాడుకోవడం లేదనిపించింది. ఇక నటుడిగా శ్రీ సింహ చాలా మెరుగయ్యాడు. చాలా చోట్ల సత్యకి పోటీగా ఎక్స్ ప్రెషన్స్ పలికించాడు. దీంతో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఇదే సినిమాకి బలం అయ్యింది. ఇక హీరోయిన్ ఫరియా అబ్దుల్లాకి ఫుల్ మార్క్స్ పడతాయి. సాలిడ్ రోల్ లో అంతే స్ట్రాంగ్ గా నటించింది. వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, సునీల్ అందరూ మెప్పించారు. ఇక టెక్నికల్ గా కూడా టీమ్ కి మంచి మార్క్స్ పడతాయి. కాలభైరవ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. రైటింగ్ పరంగా మంచి డైలాగ్స్ పడ్డా.. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. డైరెక్టర్ గా మాత్రం రితీశ్ రాణా మరోసారి మంచి మార్కులు దక్కించుకున్నాడు.
ప్లస్ లు:
రేటింగ్: 2.75/5
చివరి మాట: మత్తు వదలరా 2: కామెడీ ఇష్టపడే వారు చూడొచ్చు