iDreamPost
android-app
ios-app

నేషనల్ అవార్డు విన్నర్.. బన్నీకి చెర్రీ దంపతుల స్పెషల్ గిఫ్ట్!

  • Author ajaykrishna Updated - 10:42 AM, Sat - 26 August 23
  • Author ajaykrishna Updated - 10:42 AM, Sat - 26 August 23
నేషనల్ అవార్డు విన్నర్.. బన్నీకి చెర్రీ దంపతుల స్పెషల్ గిఫ్ట్!

నేషనల్ అవార్డు రాకతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు మరోసారి దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది. పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. జాతీయ అవార్డు కైవసం చేసుకున్నాడు. దీంతో జాతీయ అవార్డు అందుకున్న మొట్టమొదటి తెలుగు యాక్టర్ గా బన్నీ హిస్టరీలోకెక్కాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా.. 2021లో విడుదలై పాన్ ఇండియా రేంజ్ లో మంచి విజయం అందుకుంది. ఇప్పుడు ఆ సినిమాలో బన్నీ పోషించిన పుష్పరాజ్ క్యారెక్టర్ కి.. ఆ క్యారెక్టర్ లో బన్నీ నటనకు నేషనల్ అవార్డు వరించింది. దీంతో అటు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులతో పాటు బన్నీ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.

ఇక బన్నీకి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల నుండి సైతం ప్రశంసలు, అభినందనలు అందుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో బన్నీ పేరు ట్రెండ్ అవుతోంది. 69 ఏళ్లలో బెస్ట్ యాక్టర్ గా ఏ తెలుగు హీరో నేషనల్ అవార్డు సొంతం చేసుకోలేదు. అంటే.. వాళ్ళందరూ తక్కువని కాదు.. వాళ్లంతా నటనలో లెజెండ్స్ అనిపించుకున్నారు. కానీ.. అవార్డులు ఎందుకు రాలేదో తెలియదు. మొత్తానికి ఇన్నాళ్లకు తెలుగు నుండి అల్లు అర్జున్ ఈ ఫీట్ సాధించడంతో.. రెండు తెలుగు స్టేట్స్ లోని ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. బన్నీకి ఆల్రెడీ అభినందనలతో పాటు స్పెషల్ గిఫ్టులు కూడా అందుతున్నట్లు తెలుస్తోంది.

Ram charan and upasana gift to allu arjun

తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు.. నేషనల్ అవార్డు విన్నర్ బన్నీకి స్పెషల్ గిఫ్ట్ ఒకటి పంపించారు. దీంతో ఆ గిఫ్ట్ చూసిన బన్నీ.. టచ్ చేశారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం విశేషం. చెర్రీ దంపతులు బన్నీకి ఓ బొకే పంపించి.. దానిపై స్పెషల్ నోట్ రాసుకొచ్చారు. అదేంటంటే.. “డియర్ బన్నీ కంగ్రాట్స్.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నువ్వు ఇలాంటివి ఇంకా ఎన్నో సాధించాలని.. సాధిస్తావని అంటూ విష్ చేశారు. అది చూసిన బన్నీ ఎమోషనల్ అయి.. ‘థాంక్యూ సో మచ్.. టచ్ చేశారు’ అంటూ తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశాడు. ప్రస్తుతం చెర్రీ – బన్నీల విషెస్ విషయం మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ లో ఆనందం రెట్టింపు చేస్తోంది. మరి వీరి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio