iDreamPost
android-app
ios-app

Upasana Konidela: పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన సంచలన నిర్ణయం! పోస్ట్ వైరల్..

  • Author Soma Sekhar Updated - 02:57 PM, Wed - 14 June 23
  • Author Soma Sekhar Updated - 02:57 PM, Wed - 14 June 23
Upasana Konidela: పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన సంచలన నిర్ణయం! పోస్ట్ వైరల్..

మెగా కోడలు ఉపాసన గురించి ఈ రెండు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఓ వైపు అపోలో మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతూనే.. మరో వైపు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా భర్త రామ్ చరణ్ తో కలిసి సెలబ్రిటీల వేడుకలకు హాజరవుతూ ఉంటారు ఉపాసన. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటూ.. మహిళలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంటారు. ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్ అన్న విషయం మనందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పుట్టబోయే బిడ్డ కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు ఉపాసన. తమ పెళ్లి రోజు సందర్భంగా.. ఉపాసన చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులకు పెళ్లి జరిగి నేటితో (జూన్ 14) 11సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఉపాసన తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ ను షేర్ చేసింది. ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు ఉపాసనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే? “నేను స్టెమ్ సైట్ ఇండియాను ఎంచుకున్నాను. నా పుట్టబోయే బిడ్డకు సంబంధించిన కోర్డ్ బ్లడ్ (బొడ్డు తాడు)ను సురక్షితంగా ఉంచుకోవడం కోసం” అని రాసుకొచ్చారు ఉపాసన. దీని వలన ఉపయోగం ఏంటంటే? బొడ్డు తాడును దాచుకోవడం వల్ల.. పెద్దయ్యాక ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే.. వాటి చికిత్సకు బొడ్డు తాడును ఉపయోగిస్తారు. దాంతో శిశువు ఆరోగ్యానికి ఎలాంటి డోకా ఉండదు.

ఇక ఇదే విషయాన్ని గతంలో మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కూడా తెలియపరిచారు. అయితే సాధారణ ప్రజలకు స్టెమ్ సెల్ సిస్టమ్ గురించి పెద్దగా అవగాహన లేదనే చెప్పాలి. వారిలో చైతన్యం తెచ్చేందుకు ఉపాసన చేసిన పని ఎంతగానో తొడ్పడుతుంది. ఇక మెగా కోడలు చేసిన పనికి సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి. పుట్టబోయే బిడ్డ భవిష్యత్ గురించి ఉపాసన తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడుతున్నారు. మరికొందరు రామ్ చరణ్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేశారు.