iDreamPost
android-app
ios-app

Ram Charan: చరణ్-సుకుమార్-ఓ పాన్ వరల్డ్ మూవీ! థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

  • Published Aug 08, 2024 | 11:26 AM Updated Updated Aug 08, 2024 | 11:28 AM

రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్ లో మళ్లీ సినిమా ఎప్పుడు రాబోతుందా? అని ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు అభిమానులు. అయితే త్వరలోనే వారి నుంచి ఏకంగా పాన్ వరల్డ్ రేంజ్ లో మూవీ రానుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్ లో మళ్లీ సినిమా ఎప్పుడు రాబోతుందా? అని ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు అభిమానులు. అయితే త్వరలోనే వారి నుంచి ఏకంగా పాన్ వరల్డ్ రేంజ్ లో మూవీ రానుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Ram Charan: చరణ్-సుకుమార్-ఓ పాన్ వరల్డ్ మూవీ! థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

‘రంగస్థలం’.. రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చరణ్ యాక్టింగ్ ను మరో లెవల్ కు తీసుకెళ్లింది ఈ చిత్రం. అలాగే సుకుమార్ టేకింగ్ కు అభిమానులతో సహా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఫిదా అయ్యారు. దాంతో కలెక్షన్ల వర్షం కురిపించింది రంగస్థలం. ఇక ఈ మూవీ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. వారి ఆశలు త్వరలోనే నెరవేరబోతున్నట్లు తెలుస్తోంది. చరణ్-సుక్కు ఈసారి ఏకంగా పాన్ వరల్డ్ మూవీతో రాబోతున్నట్లు టాక్.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ ను పూర్తి చేశాడు. నెక్ట్స్ ఉప్పెన ఫేమ్ బచ్చిబాబు దర్శకత్వంలో RC16 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇక ఈ చిత్రం తర్వాత చరణ్ ఎవరితో సినిమా చేస్తాడా? అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే బచ్చిబాబు ప్రాజెక్ట్ తర్వాత చరణ్-సుకుమార్ కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది. RC16 పూర్తి చేసేలోపు సుకుమార్ పుష్ప 2 ను ఫినిష్ చేసి, చరణ్ తో చేసే సినిమాపై కూర్చుంటారు. ఇప్పటికే సమయం దొరికినప్పుడల్లా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నాడట.

Charan Kumar Pan World Movie!

కాగా.. రామ్ చరణ్-సుకుమార్ కాంబో వచ్చే RC17 మూవీ పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం గ్లోబల్ రేంజ్ లో ఉన్న ఇష్యూని మెయిన్ పాయింట్ గా తీసుకుంటున్నారట. గ్లోబల్ టచ్ తో ఈ చిత్రం రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ కు వరల్డ్ వైడ్ గా క్రేజ్ వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే సుక్కు భారీ ప్లాన్ చేస్తున్నాడు. ఇంటర్నేషనల్ వైడ్ గా ఉన్న సమస్యను ఇందులో కీ పాయింట్ గా తీసుకుని ఈ మూవీని తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే తన రైటింగ్ టీమ్ తో స్క్రిప్ట్ పనులు కూడా మెుదలుపెట్టేశాడట సుక్కు. చరణ్ యాక్టింగ్, సుకుమార్ టేకింగ్ కి పాన్ వరల్డ్ స్టోరీ పడితే.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.