iDreamPost
android-app
ios-app

Mahesh Babu: మీరు నిజమైన ఛాంపియన్.. వినేశ్ ఫొగాట్ కు అండగా మహేశ్! పోస్ట్ వైరల్..

  • Published Aug 08, 2024 | 10:01 AM Updated Updated Aug 08, 2024 | 10:01 AM

మీరు నిజమైన ఛాంపియన్ అంటూ వినేశ్ ఫొగాట్ కు దేశం మెుత్తం అండగా నిలబడుతోంది. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆమెకు ధైర్యం చెబుతూ ఓ పోస్ట్ చేశాడు.

మీరు నిజమైన ఛాంపియన్ అంటూ వినేశ్ ఫొగాట్ కు దేశం మెుత్తం అండగా నిలబడుతోంది. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆమెకు ధైర్యం చెబుతూ ఓ పోస్ట్ చేశాడు.

  • Published Aug 08, 2024 | 10:01 AMUpdated Aug 08, 2024 | 10:01 AM
Mahesh Babu: మీరు నిజమైన ఛాంపియన్.. వినేశ్ ఫొగాట్ కు అండగా మహేశ్! పోస్ట్ వైరల్..

పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ గోల్డ్ మెడల్ సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించిన విధంగా ఫైనల్లో నిబంధనల కంటే అధిక బరువు ఉందన్న కారణంతో ఆమెపై అనర్హత వేటు పడింది. దాంతో పతకం కల చెదిరింది. ఈ సంఘటనతో యావత్ భారతదేశం షాక్ కు గురైంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీతో సహా పలువురు ప్రముఖులు వినేశ్ ఫొగాట్ కు అండగా నిలబడుతూ ధైర్యం చెబుతున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆమెకు అండగా నిలబడతూ ఓ పోస్ట్ చేశాడు.

ఒలింపిక్స్ లో అధిక బరువు కారణంగా అనర్హతకు గురైన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కు సెలబ్రిటీల నుంచి అండ లభిస్తోంది. నువ్వు నిజమైన ఛాంపియన్ అంటూ ఆమెకు ధైర్యం చెబుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. తాజాగా మహేశ్ బాబు కూడా ఆమెకు అండగా నిలిచాడు. ఆమెకు ధైర్యం చెబుతూ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఈ విధంగా రాసుకొచ్చాడు.

Mahesh gave courage to Vinesh Phogat!

“మీరు నిజమైన ఛాంపియన్.. ఈరోజు ఫలితంతో సంబంధం లేదు. మీరు ఆ నిర్ణయాన్ని ఎలా ఎదుర్కొన్నారో అది మీ గొప్పతనం. ఇక మీరు నిజమైన ఛాంపియన్ అని అందరికీ ఎప్పుడో చూపించారు. కష్ట సమయాల్లో మీరు చూపించే ధైర్యం, బలం అందరికీ స్ఫూర్తి. పతకం వచ్చిందా? లేదా? అన్నది ముఖ్యం కాదు. మీరు పంచే స్పూర్తి మా అందరిలో ప్రకాశిస్తుంది. 1.4  బిలియన్ హృదయాలు మీతోనే ఉన్నాయి” అంటూ తన స్టోరీలో రాసుకొచ్చాడు మహేశ్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక వినేశ్ ఫొగాట్ కు మద్ధతుగా నిలిచిన వారిలో తాప్సీ, ఆలియా భట్, పర్హాన్ అక్తర్, సమంతతో పాటుగా ఇంకా చాలా మంది ప్రముఖులు ఉన్నారు. ఇదిలా ఉండగా.. తన ఒలింపిక్ పతకం కల చెదరడంతో.. రెజ్లింగ్ కు వినేశ్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş