iDreamPost
android-app
ios-app

ఇంద్ర సినిమా షూటింగ్‌లో ఉన్న ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా?

  • Published Aug 21, 2024 | 6:53 PM Updated Updated Aug 21, 2024 | 6:53 PM

Ram Charan, Indra, Chiranjeevi: 22 ఏళ్ల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంచలనాలు సృష్టించిన ఇంద్ర సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అవుతోంది. అందులో ఓ స్టార్‌ హీరో కుర్రాడిగా ఉన్నాడు. అతనెవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Ram Charan, Indra, Chiranjeevi: 22 ఏళ్ల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంచలనాలు సృష్టించిన ఇంద్ర సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అవుతోంది. అందులో ఓ స్టార్‌ హీరో కుర్రాడిగా ఉన్నాడు. అతనెవరో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Aug 21, 2024 | 6:53 PMUpdated Aug 21, 2024 | 6:53 PM
ఇంద్ర సినిమా షూటింగ్‌లో ఉన్న ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా?

ఇంద్ర.. తెలుగు సినిమా రికార్డులను తిరగరాసిన సినిమా. మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ హిట్‌గా నిలిచింది. 2002 జులై 22న విడుదలైన ఇంద్ర సినిమా.. రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళ్లింది. ‘ఇంద్రా.. ఇంద్రసేనా రెడ్డి’ ‘మొక్కే కదాని పీకేస్తే.. పీకకోస్తా’ అలాంటి డైలాగ్‌లు అప్పట్లో ఓ సెన్సేషన్‌. అలాంటి బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ను.. చిరు బర్త్‌డే(ఆగస్టు 22) సందర్భంగా రీ-రిలీజ్‌ చేస్తున్నారు. మరోసారి ఇంద్ర మ్యానరిజాన్ని, ఆ మ్యాజిక్‌ను ఎక్స్‌పీరియన్స్‌ చేయాలని.. ఇప్పటికే మెగా అభిమానులు ఫిక్స్‌ అయిపోయారు.

ఈ క్రమంలో ఇంద్ర సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంద్రలోని వీణ స్టెప్‌కు అయితే.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి. అలాగే ‘అమ్మడు బుచ్చి’ అనే పాటకు.. మెగాస్టార్‌ స్టెప్పులకు అభిమానులు ఊగిపోయారు. ఆ సాంగ్‌కు రాఘవ లారెన్స్‌ కొరియోగ్రాఫీ చేశారు. ఆ పాట్‌ షూటింగ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. అందులో.. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలుతూ.. గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన కుర్రాడు ఉన్నాడు.

ఈ పాటికే అతను ఎవరో గుర్తుపట్టేసి ఉంటారు. ఎస్‌.. మీరు అనుకున్నది నిజమే. అతను గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణే. ఇంద్ర సినిమా షూటింగ్‌ సమయంలో స్కూల్‌ పిల్లాడు. సెలవులు ఉన్నప్పుడు నాన్నతో కలిసి.. సరదాగా షూటింగ్‌లకు వెళ్లేవాడు. రామ్‌ చరణ్‌తో పాటు మెగా ఫ్రిన్స్‌ వరణ్‌ తేజ్‌ కూడా వీడియోల ఉన్నాడు. అప్పుడు వరణ్‌ తేజ్‌ ఎంతో ఛబ్బీ ఛబ్బీగా ఉన్నాడు కదూ. అలా రామ్‌ చరణ్‌ తండ్రి సినిమా షూటింగ్‌లు చూస్తూ.. పెరిగి, తండ్రి మెగాస్టార్‌ బాటలోనే అంతర్జాతీయ స్టార్‌గా ఎదిగాడు. మరి కిందున్న వీడియోను చూసి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio