iDreamPost
android-app
ios-app

Ram Charan: అల్లు అరవింద్​ను ఇరకాటంలో పెట్టిన రామ్ చరణ్! ఇది కొత్త చిక్కు!

  • Published Jul 22, 2024 | 7:35 PM Updated Updated Jul 22, 2024 | 7:35 PM

మెగా పవర్​స్టార్ రామ్ చరణ్​ను మళ్లీ స్క్రీన్ మీద చూసేందుకు ఆయన అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అందుకు ఇంకొన్నాళ్లు ఆగక తప్పదు.

మెగా పవర్​స్టార్ రామ్ చరణ్​ను మళ్లీ స్క్రీన్ మీద చూసేందుకు ఆయన అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అందుకు ఇంకొన్నాళ్లు ఆగక తప్పదు.

  • Published Jul 22, 2024 | 7:35 PMUpdated Jul 22, 2024 | 7:35 PM
Ram Charan: అల్లు అరవింద్​ను ఇరకాటంలో పెట్టిన రామ్ చరణ్! ఇది కొత్త చిక్కు!

మెగా పవర్​స్టార్ రామ్ చరణ్​ను మళ్లీ స్క్రీన్ మీద చూసేందుకు ఆయన అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అందుకు ఇంకొన్నాళ్లు ఆగక తప్పదు. ప్రస్తుతం చెర్రీ ‘గేమ్ ఛేంజర్’ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఏస్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఎప్పుడో పూర్తవ్వాల్సింది. కానీ ఏకకాలంలో ‘గేమ్ ఛేంజర్​’తో పాటు ‘భారతీయుడు 2’ ఫిల్మ్​తో బిజీ అయిపోయారు శంకర్. ఒకేసారి రెండు సినిమాలకు పని చేయడంతో చెర్రీ మూవీ వెనుకబడిపోయింది. ఇటీవలే ‘భారతీయుడు 2’ రిలీజైంది. కానీ ‘గేమ్ ఛేంజర్’ మాత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. అయితే ఈ మూవీపై దర్శకుడు శంకర్​తో పాటు నిర్మాత దిల్ రాజు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు.

‘భారతీయుడు 2’ ప్రీరిలీజ్ వేడుకలో ‘గేమ్ ఛేంజర్’ గురించి శంకర్ మాట్లాడారు. ఈ ఫిల్మ్ తన స్టయిల్​లో ఉంటుందన్నారు. చరణ్ పార్ట్ షూటింగ్ కొంత బ్యాలెన్స్ ఉందన్నారు. ఈ మోస్ట్ ఎగ్జయిటెడ్ ప్రాజెక్ట్ గురించి తాజాగా ప్రొడ్యూసర్ దిల్ రాజు రియాక్ట్ అయ్యాడు. డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ కానుకగా ‘గేమ్ ఛేంజర్​’ను రిలీజ్ చేయనున్నామని ప్రకటించారు. దీంతో చెర్రీ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. లేట్ అయినా సరే పర్ఫెక్ట్ డేట్​కే ఫిల్మ్​ను తీసుకొస్తుండటంతో హ్యాపీగా ఫీలవుతున్నారు. అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. తన మావయ్య, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్​ను ఇప్పుడు రామ్ చరణ్ ఇరకాటంలో పెట్టేశారు. ‘గేమ్ ఛేంజర్’ ఆలస్యమే దీనికి కారణంగా చెప్పొచ్చు.

అల్లు అరవింద్ నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘తండేల్’. అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి నటిస్తున్న ఈ సినిమాను క్రిస్మస్​కు విడుదల చేస్తామయని ముందే ప్రకటించారు మేకర్స్. కానీ ‘గేమ్ ఛేంజర్’ కూడా అదే తేదీకి వస్తోంది. కాబట్టి చరణ్ కోసం అరవింద్ తప్పకుండా డేట్ మారుస్తారు. కానీ.. అసలు సమస్య ఏంటంటే.. ‘తండేల్’కు మళ్లీ మంచి రిలీజ్ డేట్ లేదు. సంక్రాంతి పండుగ షెడ్యూల్ ఎప్పుడో ఫిల్ అయిపోయింది. ఒకవేళ ఫిబ్రవరికి పోతే ఖర్చులు, వడ్డీలు పెరిగిపోతాయి. డిసెంబర్ మొదట్లో వద్దామంటే ‘పుష్ప’ సెకండ్ పార్ట్ ఆల్రెడీ కర్చీఫ్ వేసేసింది. కాబట్టి.. ఇప్పుడు ‘తండేల్’ టీమ్, అరవింద్ ఇరకాటంలో పడ్డారు. దీన్ని అధిగమించేందుకు వాళ్లు ఏం ప్లాన్ చేస్తారో చూడాలి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibommatbet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap