iDreamPost
android-app
ios-app

పుష్ప 2 కోసం 8 సినిమాలు వదులుకున్నా! నటుడు షాకింగ్ కామెంట్స్..

  • Published Jul 22, 2024 | 5:36 PM Updated Updated Jul 22, 2024 | 5:36 PM

పుష్ప 2 కోసం ఏకంగా 8 సినిమాలు వదులుకున్నానని చెప్పుకొచ్చాడు స్టార్ యాక్టర్. దాంతో ఈ యాక్టర్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ అంటున్నారు సినీ అభిమానులు.

పుష్ప 2 కోసం ఏకంగా 8 సినిమాలు వదులుకున్నానని చెప్పుకొచ్చాడు స్టార్ యాక్టర్. దాంతో ఈ యాక్టర్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ అంటున్నారు సినీ అభిమానులు.

  • Published Jul 22, 2024 | 5:36 PMUpdated Jul 22, 2024 | 5:36 PM
పుష్ప 2 కోసం 8 సినిమాలు వదులుకున్నా! నటుడు షాకింగ్ కామెంట్స్..

ఓ సినిమా ఒప్పుకున్నాక డైరెక్టర్ ఎలా చెబితే అలా మేకోవర్ అవ్వాల్సిందే. ఆ చిత్రం పూర్తి అయ్యాకే లుక్ మార్చాల్సి ఉంటుంది. అలా కాదని లుక్స్ లో ఛేంజ్ వస్తే.. అసలుకే మోసం వస్తుంది. ఈ విషయంలో కొందరు నటులు నిక్కచ్చిగా ఉంటారు. తాను కూడా అలా ఉండి.. పుష్ప 2 కోసం ఏకంగా 8 సినిమాలు వదులుకున్నానని చెప్పుకొచ్చాడు స్టార్ యాక్టర్ శ్రీతేజ్. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తున్నాడు ఈ నటుడు.

శ్రీతేజ్.. పుష్ప, ధమాకా, మంగళవారం లాంటి విభిన్నమైన సినిమాల్లో విలక్షణమైన పాత్రలు పోషిస్తూ.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పుష్ప 2లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఈ పుష్ప 2లో నటించడం కోసం తాను ఏకంగా 8 సినిమాలు వదులుకున్నట్లు స్వయంగా చెప్పాడు. శ్రీతేజ్ మాట్లాడుతూ..”పుష్ప 2 కోసం నేను పది నెలల్లో దాదాపు 8 ప్రాజెక్ట్ ల దాక వదులుకున్నాను. ఎందుకంటే? ఇంత పెద్ద సినిమాలో చేస్తున్నప్పుడు వాళ్లు ఎప్పుడు పిలిస్తే.. అప్పుడు వెళ్లాల్సి వస్తుంది. పైగా షెడ్యూల్స్ కూడా మారుతూ ఉంటాయి. నేను వేరే సినిమాలు ఒప్పుకొని గడ్డం తీసేస్తే.. మళ్లీ ఈ రేంజ్ లో గడ్డం పెరగడానికి చాలా టైమ్ పడుతుంది. దాంతో సినిమాపై ప్రభావం పడుతుంది. కాబట్టి నా లుక్ కోసం ఇన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది” అంటూ చెప్పుకొచ్చాడు శ్రీతేజ్.

కాగా.. పుష్ప 2 డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. రేపో మాపో షూటింగ్ ప్రారంభం అవుతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ప్రస్తుతం శ్రీతేజ్ ప్రధాన పాత్రాలో నటించిన ‘బహిష్కరణ’ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో అంజలి, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో నటించారు. మరి పుష్ప 2 మూవీ కోసం 8 సినిమాలు వదులుకున్న శ్రీతేజ్ డెడికేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetcup girişgrandpashabet