iDreamPost
android-app
ios-app

Ram Charan: చరణ్ వర్సెస్ ఆమిర్.. హిట్టు కొట్టాలంటే ఈ గండాన్ని దాటాల్సిందే!

  • Published Jul 23, 2024 | 6:45 PM Updated Updated Jul 23, 2024 | 6:45 PM

మెగా పవర్​స్టార్ రామ్ చరణ్​ను బిగ్ స్క్రీన్స్​లో చూసేందుకు ఆయన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు, మూవీ లవర్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి ఇంకా టైమ్ పడుతుంది.

మెగా పవర్​స్టార్ రామ్ చరణ్​ను బిగ్ స్క్రీన్స్​లో చూసేందుకు ఆయన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు, మూవీ లవర్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి ఇంకా టైమ్ పడుతుంది.

  • Published Jul 23, 2024 | 6:45 PMUpdated Jul 23, 2024 | 6:45 PM
Ram Charan: చరణ్ వర్సెస్ ఆమిర్.. హిట్టు కొట్టాలంటే ఈ గండాన్ని దాటాల్సిందే!

మెగా పవర్​స్టార్ రామ్ చరణ్​ను బిగ్ స్క్రీన్స్​లో చూసేందుకు ఆయన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు, మూవీ లవర్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి ఇంకా టైమ్ ఉంది. ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘గేమ్ ఛేంజర్’ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఏస్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూట్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని జరుపుకోనుంది. ఇంకా చరణ్ పాత్ర షూటింగ్ కాస్త బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. దీంతో ఈ ఫిల్మ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ కానుకగా ‘గేమ్ ఛేంజర్​’ను విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు గుడ్ న్యూస్ చెప్పారు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది.

క్రిస్మస్ వీక్​లో టాలీవుడ్​తో పాటు ఇతర ఇండస్ట్రీల్లోనూ పలు క్రేజీ మూవీస్ రిలీజ్ కానున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ సూపర్​స్టార్ ఆమిర్ ఖాన్​తో చరణ్​కు ఫైట్ తప్పేలా లేదు. ఎందుకంటే ఆమిర్​ చిత్రం ‘సితారే జమీన్ పర్’ డిసెంబర్ 25న విడుదల కానుంది. ‘గేమ్ ఛేంజర్’ అదే నెల 20వ తేదీన ఆడియెన్స్ ముందుకు రానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద చరణ్ వర్సెస్ ఆమిర్ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఆమిర్ నటిస్తూ, స్వీయ నిర్మాణంలో రూపొందించిన ‘తారే జమీన్ పర్’ బ్లాక్​బస్టర్ హిట్​గా నిలిచింది. అదే సినిమాకు సీక్వెల్​గా ఇప్పుడు ‘సితారే జమీన్ పర్​’ను తీసుకొస్తున్నారు ఆమిర్. దీంతో నార్త్ ఆడియెన్స్​లో ఈ ఫిల్మ్ మీద భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం కోసం అక్కడి మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

‘గేమ్ ఛేంజర్’, ‘సితారే జమీన్ పర్’ ఒకే వారంలో విడుదలైతే కచ్చితంగా థియేటర్ల సమస్య వస్తుంది. అలాగే ఓపెనింగ్స్ మీద కూడా ప్రభావం పడుతుంది. చరణ్ చిత్రం ముందు విడుదలవుతుంది కాబట్టి మంచి రేంజ్​లో స్క్రీన్లు దక్కుతాయి. కానీ టాక్ బాగున్నా ఆ తర్వాత సినిమా నడవడం కష్టమే. ఎందుకంటే మ్యాగ్జిమమ్ థియేటర్లను ఆమిర్ సినిమా ఆక్రమించేస్తుంది. ‘సితారే జమీన్ పర్​’తో బాలీవుడ్​లో సమస్యను ఎదుర్కొంటున్న మెగా పవర్​స్టార్.. ఓవర్సీస్​లో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 20న రానుంది. చరణ్ బిగ్ హిట్ కొట్టాలంటే ఈ రెండు సినిమాల గండాన్ని దాటాలి. ఈ త్రిముఖ పోరులో ‘గేమ్ ఛేంజర్’ ఎంతవరకు నెగ్గుకొస్తాడో చూడాలి. మరి.. ఆమిర్​తో బాక్సాఫీస్ ఫైట్​లో చరణ్ గెలుస్తాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.