iDreamPost
android-app
ios-app

ఒకే ఫ్రేములో బన్నీ, చరణ్‌.. ఆ పుకార్లకు చెక్‌!

  • Published Oct 31, 2023 | 1:07 PM Updated Updated Oct 31, 2023 | 1:07 PM

మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో జరిగిన పార్టీకి అల్లు అర్జున్‌ కనిపించలేదు. తర్వాత అల్లు అర్జున్‌ ఇంట్లో ఓ పార్టీ జరిగింది.

మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో జరిగిన పార్టీకి అల్లు అర్జున్‌ కనిపించలేదు. తర్వాత అల్లు అర్జున్‌ ఇంట్లో ఓ పార్టీ జరిగింది.

  • Published Oct 31, 2023 | 1:07 PMUpdated Oct 31, 2023 | 1:07 PM
ఒకే ఫ్రేములో బన్నీ, చరణ్‌.. ఆ పుకార్లకు చెక్‌!

మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌- హీరోయిన్‌ లావణ్య త్రిపాఠిల వివాహం బుధవారం ఘనంగా జరగనుంది. ఇటలీలో జరగనున్న ఈ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు అతి కొద్దిమందికి మాత్రమే ఆహ్వానం అందింది. ఇక, పెళ్లికి మూడు రోజుల ముందు నుంచే పెళ్లి సందడి మొదలైంది. నిన్న కాక్‌టైల్‌ పార్టీ జరిగింది. ఈ రోజు హల్దీ, మెహందీ వేడుకలు జరగనున్నాయి. రేపు వరుణ్‌-లావణ్యలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వనున్నారు. పెళ్లి తర్వాత నవంబర్‌ 5న గ్రాండ్‌ రిసెప్షన్‌ ఉండనుంది.

నిన్న రాత్రి జరిగిన పెళ్లి కాక్‌టైల్‌ పార్టీలో రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ సందడి చేశారు. ఇద్దరూ ఒకే ఫ్రేములో ఉన్న ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో చరణ్‌, బన్నీలు నవ్వుతూ కనిపిస్తూ ఉన్నారు. ఈ ఫొటోతో గత కొద్దిరోజులనుంచి నడుస్తున్న పుకార్లకు చెక్‌ పెట్టినట్లు అయింది. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లో రెండు పార్టీలు జరిగాయి. మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో జరిగిన పార్టీకి అల్లు అర్జున్‌ కనిపించలేదు. తర్వాత అల్లు అర్జున్‌ ఇంట్లో ఓ పార్టీ జరిగింది.

ఈ పార్టీలో రామ్‌ చరణ్‌ కనిపించలేదు. దీంతో పుకార్లు మొదలయ్యాయి. రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ల మధ్య దూరం పెరిగిందంటూ వార్తలు రాయటం మొదలుపెట్టారు. నిన్న జరిగిన కాక్‌టైల్‌ పార్టీలో ఇద్దరూ ఒకే చోట కలిసి ఉండటంతో పుకార్లకు చెక్‌ పడింది. అంతేకాదు! ఇద్దర్నీ ఒకే ఫ్రేమలో చూసి అటు చరణ్‌ ఫ్యాన్స్‌.. ఇటు బన్నీ ఫ్యాన్స్‌ ఇద్దరూ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. మరి, చరణ్‌-బన్నీలు ఒకే ఫ్రేములో కనిపించటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş