iDreamPost
android-app
ios-app

Rakul Preet Singh: పెళ్లి విషయంలో రకుల్ మంచి నిర్ణయం.. 10 మందికి ఆదర్శంగా!

  • Published Feb 14, 2024 | 1:43 PM Updated Updated Feb 14, 2024 | 2:43 PM

సినీ తారలు ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానీ వివాహం అతి త్వరలో జరుగబోతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా వీరి వివాహానికి సంబంధించి ఆ జంట కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

సినీ తారలు ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానీ వివాహం అతి త్వరలో జరుగబోతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా వీరి వివాహానికి సంబంధించి ఆ జంట కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

  • Published Feb 14, 2024 | 1:43 PMUpdated Feb 14, 2024 | 2:43 PM
Rakul Preet Singh: పెళ్లి విషయంలో రకుల్ మంచి నిర్ణయం.. 10 మందికి ఆదర్శంగా!

సాధారణంగా ఈ మధ్య కాలంలో వివాహం అంటే .. ప్రతి ఒక్కరు ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి .. పెళ్లి తంతు ముగిసే వరకు .. ప్రతి ఒక్క ఈవెంట్ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఇక ఈవెంట్ ను టచ్ చేసిన ఖర్చు కూడా అంతే భారీగా ఉంటుంది. అలానే దాని వలన.. మరో వైపు పర్యావరణానికి .. కలిగే పొల్యూషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ క్రమంలో సినీ తారల పెళ్లిళ్ల గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సిటీలకు దూరంగా జరుపుకున్నా కూడా .. వారి వివాహాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే, వీటి అన్నిటికి విరుద్ధంగా తమ వివాహాన్ని జరుపుకోడానికి ప్లాన్ చేస్తున్నారు.. రకుల్ ప్రీత్ సింగ్ , జాకీ భగ్నానీ జంట. తాజాగా వారి వవివాహానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఈ జంట. దీనితో అభిమానులు వారిని ప్రశంసలతో ముంచేస్తున్నారు. వాటికీ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గత కొన్నేళ్లుగా టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ , ప్రముఖ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ .. ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారి వివాహం.. ఫిబ్రవరి 21న గోవా వేదికగా అంగరంగ వైభవంగా జరగనుంది. దానికి సంబంధించిన వేడుకలు .. ఫిబ్రవరి 19నుంచే ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ జంట వారి వివాహాన్ని ఎకో ఫ్రెండ్లీగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారట. సహజంగా సినీ తారల పెళ్లంటే టపాసులు ఉండనే ఉంటాయి. వాటి వలన పర్యావరణానికి చాలా నష్టం కలుగుతుందని తెలిసినా.. పెళ్లిళ్లలో ఇలాంటివన్నీ సహజం అయిపోయాయి. అయితే, రకుల్ , జాకీ వివాహంలో మాత్రం ఇలాంటి ఆడంబరాలు ఉండవట. ముఖ్యంగా ఈ టపాసులకి అసలు చోటు లేదట. అంతేకాకుండా పేపర్ వేస్ట్‌ను తగ్గించేందుకు.. ఎక్కువ మందికి వీరి వివాహ ఆహ్వానాన్ని డిజిటల్ రూపంలోనే ఇవ్వాలని నిర్ణయించుకున్నారట ఈ జంట. దీనికి సంబంధించి ఇప్పటికే డిజిటల్‌ ఇన్విటేషన్‌కు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

పైగా , విందు , వినోదాలకు సంబంధించి కూడా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారట రకుల్ , జాకీ. దాని కోసం అతిథులకు ముందుగానే సమాచారమిస్తున్నారట. మొత్తానికి వీరిద్దరూ వారి వివాహాన్ని ఎకో ఫ్రెండ్లీగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈ విషయం అనౌన్స్ చేసిన తర్వాత . అభిమానులు వీరిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సెలెబ్రిటీలు , సామాన్యులు అంతా కూడా .. ఇలాంటి మంచి నిర్ణయాలను తీసుకుంటే బావుంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీరిద్దరూ కూడా సినీ రంగానికి సంబంధించిన వారే కాబట్టి.. ముందుగానే సినీ ప్రముఖుల నుంచి ఆశీస్సులు అందుకుంటున్నారు ఈ జంట. మరి, ఈ జంట తమ వివాహ విషయంలో తీసుకున్న నిర్ణయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/