iDreamPost
android-app
ios-app

రజినీకాంత్ ‘లాల్ సలామ్’ ట్రైలర్.. ఫస్ట్ టైమ్ మనో వాయిస్ మిస్!

Lal Salaam Movie Trailer Review In Telugu: రజినీకాంత్ లాల్ సలామ్ ట్రైలర్ వచ్చేసింది. మరి.. ఆ యాక్షన్ ప్యాక్డ్ ట్లైలర్ ఎలా ఉందో చూడండి.

Lal Salaam Movie Trailer Review In Telugu: రజినీకాంత్ లాల్ సలామ్ ట్రైలర్ వచ్చేసింది. మరి.. ఆ యాక్షన్ ప్యాక్డ్ ట్లైలర్ ఎలా ఉందో చూడండి.

రజినీకాంత్ ‘లాల్ సలామ్’ ట్రైలర్.. ఫస్ట్ టైమ్ మనో వాయిస్ మిస్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా రిలీజ్ అంటే పాన్ వరల్డ్ స్థాయిలో ఒక బజ్ క్రియేట్ అవుతుంది. కానీ, లాల్ సలామ్ సినిమా విషయంలో మాత్రం ఆ ట్రెండ్ కనిపించడం లేదు. ఎందుకో ఈ మూవీ ప్రేక్షకుల్లోకి పెద్ద వెళ్లలేదు అనిపిస్తోంది. ఇంకో రెండ్రోజుల్లో రిలీజ్ కాబోతున్న సినిమాపై ఎందుకు ఆసక్తి కలగడంలేదు అని అంతా అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానంగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. లాల్ సలామ్ ట్రైలర్ వచ్చాక మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. మరి.. లాల్ సలామ్ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.

ఇప్పటివరకు చూసిన రజినీకాంత్ సినిమాలు అన్నీ ఒకెత్తు ఈ లాల్ సలామ్ మూవీ ఒకెత్తు అని చెప్పాలి. ఎందుకంటే మొదటిసారి రజినీకాంత్ కి సింగర్ మను కాకుండా.. సాయికుమార్ డబ్బింగ్ చెప్పారు. ఈ ట్రైలర్ చూస్తున్నంతసేపు కాస్త కొత్తగానే అనిపిస్తుంది. ఈ ట్రైలర్ లో కావాల్సినన్ని ఎలివేషన్స్ ఉన్నాయి. పైగా కథ కూడా ఆసక్తిరేపే విధంగా ఉంది. రెండు ఊర్ల మధ్య తేరు జాతర విషయంలో వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఎలాగోలా అవి సద్దుమణుగుతున్నాయి అనుకున్న నేపథ్యంలో అవి మరింత ముదురుతాయి. ఆ గొడవల్లోకి జలాలీ భాయ్ ఎంట్రీ ఇస్తాడు. అలాగే విష్ణువిశాల్ క్యారెక్టర్ కూడా బాగా హైలెట్ గా నిలవనుంది. క్రికెటర్ కావాల్సిన ఇతను జైలుపాలు అయినట్లు చూపించారు. అతని కుటుంబం చుట్టూనే ఈ ఊరి గొడవలు కూడా తిరిగేలా చూపించారు.

ఈ లాల్ సలామ్ మూవీలో జీవితా రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే టీమిండియా దిగ్గజం అనీల్ కుంబ్లే ఈ మూవీలో కోచ్ గా కనిపించబోతున్నారు. ఈ మూవీలో కూడా రజినీ కాంత్ క్యారెక్టర్ కి బాషా స్టైల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని తెలుస్తోంది. డైలాగ్స్ కూడా నెక్ట్స్ లెవల్లో ఉన్నాయి. ‘మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో.. మానవత్వాన్ని అందరితో పంచుకో’ అనే డైలాగ్ తో జలాల్ భాయ్ క్యారెక్టర్ ఏంటో అర్థమైపోతుంది. కానీ, కథ పరంగా మాత్రం ఒక సాదాసీదా కథ అనిపిస్తోంది. కానీ, ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్షన్, స్క్రీన్ ప్లేతో మెస్మరైజ్ చేస్తారని అంతా భావిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 9న థియేటర్లలో విడుదల కానుంది. మరి.. లాల్ సలామ్ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.