iDreamPost
android-app
ios-app

నాగ్ అశ్విన్ పై రజనీ ప్రశంసలు.. తలైవానే దిగొచ్చాడు

  • Published Jun 29, 2024 | 5:35 PM Updated Updated Jun 29, 2024 | 5:35 PM

ప్రభాస్ కల్కి మూవీ బాక్సాఫీసును షేక్ చేస్తుంది. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 298 కోట్లను కొల్లగొట్టింది. ఈ మూవీపైనా విపరీతమైన చర్చ నడుస్తుంది. అలాగే సినీ ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ప్రభాస్ కల్కి మూవీ బాక్సాఫీసును షేక్ చేస్తుంది. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 298 కోట్లను కొల్లగొట్టింది. ఈ మూవీపైనా విపరీతమైన చర్చ నడుస్తుంది. అలాగే సినీ ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

  • Published Jun 29, 2024 | 5:35 PMUpdated Jun 29, 2024 | 5:35 PM
నాగ్ అశ్విన్ పై రజనీ ప్రశంసలు.. తలైవానే దిగొచ్చాడు

హాలీవుడ్ మీడియా కూడా చర్చించేలా చేసిన చిత్రం కల్కి 2898 ఏడీ. డార్లింగ్ ప్రభాస్, అమితాబ్ అండ్ కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులకు తగ్గట్లుగా క్యారెక్టర్స్ డిజైన్ చేసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు నాగ్ అశ్విన్. రూ. 600 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ.. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఈ రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 298 కోట్లను కొల్లగొట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సినీ ప్రముఖులు. దర్శకుడు నాగ్ అశ్విన్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ మూవీని చిన్న స్టార్ల నుండి దిగ్గజ నటుల వరకు కొనియాడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి చేరారు సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున. తమ అభిప్రాయాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు తలైవా రజనీ. ‘కల్కి సినిమా చూశాను. వావ్.. ఇదొక గొప్ప సినిమా. భారత సినిమాను నాగ్ అశ్విన్ మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఈ సినిమా సక్సెస్ అయ్యినందుకు నా ఫ్రెండ్ అశ్వినీదత్, అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణెతో పాటు కల్కి టీమ్ మొత్తానికి అభినందనలు. పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.. గాడ్ బ్లెస్’ అంటూ రజనీకాంత్ పోస్టు చేశారు. దీనికి నాగ్ అశ్విన్ రిప్లై ఇచ్చాడు. ‘సార్ మాటలు రావడం లేదు. మీరు ఆశీర్వదించడం సంతోషంగా ఉంది. మా టీం నుండి మీకు థాంక్యూ’ అంటూ ట్వీట్ చేశాడు. అలాగే కల్కి టీం కూడా రిప్లై ఇచ్చింది. ‘తలైవా మీ మాటలతో మా టీం ఉప్పొంగిపోతుంది. మరింత కష్టపడటానికి ఇది మాకు పోత్రాహాన్ని ఇస్తుంది ’ అంటూ పేర్కొంది.

అలాగే కింగ్ నాగార్జున కూడా సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. ఆయన కూడా ఓ ట్వీట్ చేశారు. ‘సూపర్ డూపర్ హిట్ సాధించిన కల్కి టీంకి కంగ్రాచ్యులేషన్స్. నాగీ..నువ్వు మా అందరినీ మరో కాలానికి, మరో ప్రాంతానికి తీసుకెళ్లిపోయావ్. ఫిక్షన్‌ను మైథాలజీ, హిస్టరీకి ముడిపెట్టి అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించావ్. అమితాబ్ జీ.. అసలైన మాస్ హీరో. కమల్ జీ మీరు ఫైర్ పుట్టించారు. మిమ్మల్ని పార్ట్ 2లో చూసేందుకు ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ప్రభాస్ మరోసారి చించేశాడు. తల్లి పాత్రలో దీపికా అద్భుతంగా కనిపించింది. అలాగే అశ్వినీ దత్, డియర్ స్వీటీ (ప్రియాంక), స్వప్నకు శుభాకాంక్షలు. ఇండియన్ సినిమా మరోసారి చేసి చూపించింది’ అంటూ నాగ్ ట్వీట్ చేశాడు. ఇక ఈసినిమాలో గెస్ట్ రోల్ చేసిన విజయ్ దేవరకొండ సైతం.. ట్వీట్ చేశాడు. ‘ఇప్పుడే సినిమా చూశాను. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఆనందంతో ఉప్పొంగిపోతున్నా. ఇండియన్ మూవీ మరో లెవల్‌కు వెళ్లింది. ఈ సినిమా వెయ్యి కోట్లను మించి పోతుంది’ అంటూ పేర్కొన్నాడు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetCasibomCasibomCasibomjojobetbetwooncasibomcasibombetcio giriş