iDreamPost
android-app
ios-app

మహేష్ మూవీ కోసం హాలీవుడ్ యాక్టర్! విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ వైరల్!

  • Author ajaykrishna Updated - 03:08 PM, Thu - 24 August 23
  • Author ajaykrishna Updated - 03:08 PM, Thu - 24 August 23
మహేష్ మూవీ కోసం హాలీవుడ్ యాక్టర్! విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ వైరల్!

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ మూవీ కోసం అనౌన్స్ మెంట్ అప్పటినుండే అంచనాలు మొదలైపోయాయి. టాలీవుడ్ లో రాజమౌళితో ఏ హీరో సినిమా చేసినా.. అది బిగ్గెస్ట్ కాంబినేషనే అవుతుంది. ఎందుకంటే.. రాజమౌళి ఏ హీరో సినిమా చేసినా.. ఆ హీరో కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోతుంది. ఇదివరకు తెలుగులోనే సినిమాలు చేసినప్పుడు హీరోలకు ఇండస్ట్రీ హిట్స్ పడేవి. కానీ.. బాహుబలి తర్వాత రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. ఆయనతో ఎవరు సినిమాలు చేసినా.. పాన్ ఇండియా స్టార్స్ అయిపోతున్నారు. సో.. ఆయన సినిమాల బడ్జెట్ తో పాటు క్రేజ్ కూడా అదే లెవెల్ లో ఉంటుందని తెలిసిందే.

ప్రస్తుతం మహేష్ బాబు.. త్రివిక్రమ్ తో గుంటూరు కారం మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ అయిపోగానే నెక్స్ట్ రాజమౌళి సినిమాలో చేరతాడు మహేష్. మరోవైపు ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ వైడ్ గుర్తింపు సొంతం చేసుకున్న రాజమౌళి.. మహేష్ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయిస్తున్నాడు. అయితే.. వీరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ గ్లోబ్ ట్రోటరింగ్ నేపథ్యంలో నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ యాక్షన్ మూవీగా రాబోతుందని ఇదివరకు రాజమౌళి క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉండబోతుందని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే.. మహేష్ బాబు కటౌట్ ఆల్రెడీ హాలీవుడ్ స్టార్స్ మాదిరే ఉంటుంది.

ఇదిలా ఉండగా.. తాజా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి తండ్రి, కథా రచయిత వి. విజయేంద్ర ప్రసాద్.. మహేష్ – రాజమౌళి సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ అందించారు. ఇన్నాళ్లు మహేష్ సినిమా కోసం రాజమౌళి హాలీవుడ్ నటులను రంగంలోకి దింపనున్నాడు అనే వార్తలు.. నిజం కావచ్చని క్లారిటీ ఇచ్చారు విజయేంద్ర ప్రసాద్. మహేష్ సినిమా కోసం హాలీవుడ్ యాక్టర్స్ ని పరిశీలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి నిజమేనా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. “అవును. మాక్సిమం హాలీవుడ్ యాక్టర్ ని తీసుకునే అవకాశం ఉంది. చూస్తున్నాం” అని హింట్ ఇచ్చారు. దీంతో ఒక్కసారి మహేష్ ఫ్యాన్స్ లో ఆనందం రెట్టింపు అయిపోయింది. మా హీరో హాలీవుడ్ స్టార్ తో తలపడబోతున్నాడు అంటూ నెట్టింట ట్రెండ్ సృష్టిస్తున్నారు. మరి మహేష్ – రాజమౌళి సినిమా గురించి మీ అంచనాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetturkey girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş