iDreamPost
android-app
ios-app

RC17 గురించి అప్పుడే చెప్పిన రాజమౌళి.. థియేటర్లు దద్దరిల్లాల్సిందేగా..

Rajamouli On RC17: రామ్ చరణ్- సుకుమార్ కాంబోలో తర్వాతి ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా అధికారికంగా ప్రకటన కూడా చేశారు. ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడో రాజమౌళి కామెంట్స్ చేశాడు. అప్పుడే ఈ మూవీ దద్దరిల్లి పోతుందని చెప్పాడు.

Rajamouli On RC17: రామ్ చరణ్- సుకుమార్ కాంబోలో తర్వాతి ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా అధికారికంగా ప్రకటన కూడా చేశారు. ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడో రాజమౌళి కామెంట్స్ చేశాడు. అప్పుడే ఈ మూవీ దద్దరిల్లి పోతుందని చెప్పాడు.

RC17 గురించి అప్పుడే చెప్పిన రాజమౌళి.. థియేటర్లు దద్దరిల్లాల్సిందేగా..

రామ్ చరణ్ ఒక్కో సినిమాతో కెరీర్లో ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఆర్సీ 16 నుంచి రామ్ చరణ్ కు అధికారికంగా గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ లైనప్ నెక్ట్స్ లెవల్లో ఉండాలని ఫ్యాన్స్ కోరుకున్నారు. దానికి తగినట్లుగానే డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీ తర్వాత బుచ్చిబాబుతో ఆర్సీ16 చేస్తున్నాడు. ఆ మూవీకి సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ మూవీలో చెర్రీ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇప్పుడు రామ్ చరణ్ 17వ మూవీకి సంబంధించిన అఫీషియల్ అప్ డేట్ కూడా వచ్చింది. అయితే ఈ మూవీ గురించి రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్ కెరీర్ లో ప్రతి మూవీ నెక్ట్స్ లెవల్లో ఉండబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎలాంటి అప్ డేట్ లేదని బాధ పడుతున్న అభిమానుల కోసం చెర్రీ పుట్టినరోజు సందర్భంగా ఒక సాంగ్ విడుదల చేయబోతున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రకటించేశాడు. ఇక నుంచి రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అన్నీ అప్ డేట్స్ పండగనే చెప్పాలేమో. ఎందుకంటే ఆర్సీ 16 పూజా కార్యక్రమం నిర్వహించడం. ఇప్పుడు ఆర్సీ17 మూవీ గురించి అధికారికంగా ప్రకటన రావడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.

ఆర్సీ17 ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. మరోసారి సుకుమార్- రామ్ చరణ్- దేవీశ్రీ ప్రసాద్ కాంబోలో ఈ మూవీ రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఇచ్చిన హైప్ అయితే మాములుగా లేదు. మరో అరుదైన చిత్రంగా ఈ ప్రాజెక్ట్ ఉండబోతోంది అంటూ క్యాప్షన్ అయితే జోడించారు. తాము తీయబోయే సినిమా గురించి ఎవరైనా అలాగే చెప్పుకుంటారు అని లైట్ తీసుకోకండి. ఈ మూవీ గురించి ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ సమయంలోనే రాజమౌళి కొన్ని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. అసలు జక్కన్న ఆర్సీ17 గురించి ఏం చెప్పాడంటే.. “రామ్ చరణ్- సుకుమార్ కాంబోలో రాబోతున్న సినిమాకి సంబంధించి నాకు ఓపెనింగ్ సీక్వెన్స్ గురించి తెలుసు. నేను ఇప్పుడు దాని గురించి చెప్పను. సుకుమార్ కి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. కానీ, ఆ మూవీ ఓపెనింగ్ సీక్వెన్స్ చూసిన తర్వాత ప్రేక్షకుల సీటు ఎడ్జ్ కి వచ్చేస్తారు” అంటూ రాజమౌళి ఆర్సీ17 గురించి హైప్ పెంచేశాడు.

ప్రస్తుతం.. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ మూవీ రంగస్థలానికి మించి హిట్టు కొడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఆర్సీ 16, ఆర్సీ 17 ప్రాజెక్ట్స్ నుంచి మాత్రం ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ఉండాలి అంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆర్సీ17 షూటింగ్ పుష్ప 2 పూర్తైన తర్వాత స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి.. ఆర్సీ 17 గురించి రాజమౌళి చేసిన వ్యాఖ్యలైప మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis