iDreamPost
android-app
ios-app

లావణ్య ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్! చెప్పుతో కొట్టాక సీన్ మారిపోయింది!

  • Published Aug 02, 2024 | 9:00 AM Updated Updated Aug 02, 2024 | 2:07 PM

Raj Tarun: లాలీవుడ్ లో నటుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుంది. పదేళ్లు తనతో లివింగ్ రిలేషన్ లో ఉన్నాడని, పెళ్లి చేసుకొని ఇప్పుడు ఓ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకొని తనను దూరం చేస్తున్నాడని లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Raj Tarun: లాలీవుడ్ లో నటుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుంది. పదేళ్లు తనతో లివింగ్ రిలేషన్ లో ఉన్నాడని, పెళ్లి చేసుకొని ఇప్పుడు ఓ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకొని తనను దూరం చేస్తున్నాడని లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  • Published Aug 02, 2024 | 9:00 AMUpdated Aug 02, 2024 | 2:07 PM
లావణ్య ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్! చెప్పుతో కొట్టాక సీన్ మారిపోయింది!

గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా.. లావణ్య-రాజ్‌తరుణ్‌-మాల్వీ మల్హోత్రా గురించే వార్తలు కనిపిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీతో పాటు, సోషల్‌ మీడియాలో కూడా.. లావణ్య చేస్తున్న ఆరోపణలు, రాజ్‌తరుణ్‌, మాల్వీ చేస్తున్న ప్రత్యారోపణల గురించే చర్చ నడుస్తోంది. రాజ్‌తరుణ్‌పై లావణ్య కేసు పెట్టడం, పోలీసులు ఇద్దరికి నోటీసులు పంపడం ఇదంతా పక్కనపెడితే.. తాజాగా లావణ్య ఒక టీవీ షోలో శేఖర్‌ బాషా అనే వ్యక్తిపై చెప్పు విసరడంతో ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్ట్‌ వచ్చి.. సీన్‌ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది.

రాజ్‌తరుణ్‌, మాల్వీ మల్హోత్రాపై పలు ఆరోపణలు చేస్తూ.. తనకు న్యాయం కావాలని లావణ్య చెబుతున్న మాటలతో చాలా మంది సోషల్‌ మీడియా వేదికగా ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇదే సమయంలో రాజ్‌తరుణ్‌ తల్లిదండ్రులు, మీడియా ముందుకు వచ్చి.. లావణ్యతో తమకు ప్రాణహాని ఉందని చెప్పారు. కానీ, ఆ విషయాన్ని అటు పోలీసులు కానీ, నెటిజన్లు కానీ పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. లావణ్యకు మద్దతుగానే చాలా పోస్టులు, కామెంట్లు వస్తూ ఉన్నాయి. అయితే.. ఇటీవల తిరగబడరాసామి మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. హీరో రాజ్‌తరుణ్‌, హీరోయిన్‌ మాల్వీ ఒక ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఆ ప్రెస్‌మీట్‌కు వచ్చిన లావణ్య.. ప్రమోషన్స్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసింది.

Lavanya

ఆ తర్వాత.. రాజ్‌తరుణ్‌ ఇంటికి వెళ్లి, తలుపులు కొడుతూ హంగామా చేసింది. తాజాగా ఓ టీవీ షోలో శేఖర్‌ బాషాను చెప్పుతో కొట్టి.. సంచలనం సృష్టించింది. మూడు నాలుగు రోజులుగా జరిగిన ఈ ఇన్సిడెంట్స్ గమనిస్తే.. లావణ్యది చాలా అగ్రెసివ్‌ అప్రోచ్‌ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రెస్‌మీట్‌ను అడ్డుకునే ప్రయత్నం, రాజ్‌తరుణ్‌ ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, శేఖర్‌ బాషను చెప్పుతో కొట్టడంతో.. ఈ మొత్తం ఎపిసోడ్‌ను జనం చూసే యాంగిల్‌లో కాస్త మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో లావణ్య.. రాజ్‌తరుణ్‌, మాల్వీ మల్హోత్రాపై కేసులు పెట్టిన విషయం తెలిసిందే.. కానీ, ఆమె చేస్తున్న పనుల వల్ల రాజ్‌తరుణ్‌ తల్లిదండ్రులు ఇప్పుడు ఆమెపై కేసు పెట్టే పరిస్థితి వచ్చింది. తమ ఇంటికి వచ్చి తలుపులు బాదుతూ.. తమను లావణ్య భయభ్రాంతులకు గురి చేసిందని.. తాజాగా రాజ్‌తరుణ్‌ తల్లిదండ్రులు మదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. లావణ్య బాధితురాలు అనే సింపథి పోగొట్టుకుంది అన్న అభిప్రాయాలు సోషల్‌ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ ఘటనలపైన లావణ్య వివరణ ఇవ్వాల్సి ఉంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş