iDreamPost
android-app
ios-app

Radhe Shyam OTT Premier : ఇలా అయితే థియేటర్ల మీద దెబ్బ పడదా

  • Published Mar 28, 2022 | 6:30 PM Updated Updated Mar 28, 2022 | 6:30 PM
Radhe Shyam OTT Premier : ఇలా అయితే థియేటర్ల మీద దెబ్బ పడదా

కళ్ళు తిరిగే బడ్జెట్ తో రూపొంది బాహుబలి రేంజ్ లో ఆడుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న రాధే శ్యామ్ ఫైనల్ గా వంద కోట్లకు పైగా నష్టం తెచ్చిన అతి పెద్ద డిజాస్టర్ గా చరిత్రలో నిలిచిపోయింది. బ్రేక్ ఈవెన్ కు సగం దూరం కూడా చేరుకోలేకపోయిన ఈ సినిమా కోసం తమన్, దర్శకుడు రాధా కృష్ణ ఎంత ప్రమోషన్ చేసినప్పటికీ లాభం లేకపోయింది. తాజాగా ఇది ఓటిటిలో వచ్చేందుకు రెడీ అయ్యింది. ఏప్రిల్ 1న అమెజాన్ ప్రైమ్ లో తెలుగు తమిళం మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ మేరకు కొత్త ట్రైలర్ ని కట్ చేసి రిలీజ్ చేశారు. నిర్మాణ సంస్థ చేయించిన వీడియో కంటే ఇది చాలా మెరుగ్గా ఉండటం గమనార్హం.

మార్చి 11న విడుదలైన రాధే శ్యామ్ సరిగ్గా 22 రోజులకే స్మార్ట్ స్క్రీన్ లో వస్తోంది. ఈ లెక్కన థియేటర్ లో రిలీజైన రెండు మూడు నెలల తర్వాతే తమ సినిమాను స్ట్రీమింగ్ కు ఇస్తామన్న నిర్మాతల మాటలు అబద్దమని అర్ధమైపోయింది. భీమ్లా నాయక్ కూడా ఆర్ఆర్ఆర్ దెబ్బకు నాలుగు వారాల గ్యాప్ లోనే ఆహా, హాట్ స్టార్ లో వచ్చేసింది. అఫ్కోర్స్ ఇది రాధే శ్యామ్ లాగా ఫ్లాప్ కాకపోయినా ఇలా రోజులు కుదించుకుపోవడం చూస్తే కామన్ ఆడియన్స్ క్రమంగా థియేటర్లకు రావడం తగ్గించేస్తారు. అసలే ఎండా కాలం. ఆర్ఆర్ఆర్ కాబట్టి ఇంత వేడిలోనూ టాక్ ని ఆధారంగా చేసుకుని భారీ వసూళ్లు దక్కించుకుంటోంది. అన్నిటికి అలా సాధ్యం కాదుగా

ఈ లెక్కన రాబోయే రోజుల్లో డిజిటల్ రిలీజులు మరీ లేట్ అవ్వవని క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు అందరి దృష్టి ఆర్ఆర్ఆర్ మీద ఉంది. ఓటిటి హక్కులు జీ5 దగ్గర ఉన్నాయి. హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ తీసుకుంది. డెబ్భై రోజుల కన్నా ముందు డిజిటల్ లో రాదని ఆ మధ్య అన్నారు కానీ అది చాలా పెద్ద గ్యాప్. అప్పటిదాకా ఉంటారా అనేది అనుమానమే. ట్రెండ్ ని గమనిస్తే ట్రిపులార్ కనీసం నెల రోజులకు పైగా స్ట్రాంగ్ రన్ సాధించేలా ఉంది. ముఖ్యంగా నార్త్ లోనూ వసూళ్లు బాగా వస్తుండటంతో స్మార్ట్ స్క్రీన్ మీదకు త్వరగా వస్తుందని ఆశించలేం.రాధే శ్యామ్ కు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా జస్టిన్ ప్రభాకరన్ పాటలు కంపోజ్ చేశారు

Also Read : RRR @ 500cr : 3 రోజుల్లో..500 కోట్లు..RRR సంచలనం!