iDreamPost
android-app
ios-app

కేశవ బెయిల్ కోసం పుష్ప టీమ్ ప్రయత్నాలు.. నిజమెంత?

  • Published Dec 13, 2023 | 5:50 PM Updated Updated Dec 13, 2023 | 5:50 PM

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ఓ స్థాయికి చేరుకున్నట్లే అతడి ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించిన జగదీష్‌కు కూడా అంతే పేరు వచ్చింది. జగదీష్ ఇప్పుడు ఓ కేసులో అరెస్టు అయ్యి జైలులో ఉన్నాడు. అతడి అరెస్టు కారణంగా షూటింగ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది.

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ఓ స్థాయికి చేరుకున్నట్లే అతడి ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించిన జగదీష్‌కు కూడా అంతే పేరు వచ్చింది. జగదీష్ ఇప్పుడు ఓ కేసులో అరెస్టు అయ్యి జైలులో ఉన్నాడు. అతడి అరెస్టు కారణంగా షూటింగ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది.

  • Published Dec 13, 2023 | 5:50 PMUpdated Dec 13, 2023 | 5:50 PM
కేశవ బెయిల్ కోసం పుష్ప టీమ్ ప్రయత్నాలు.. నిజమెంత?

ఫ్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన పుష్ప సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కేశవ పాత్రతో ఆకట్టుకున్న యాక్టర్ జగదీష్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ మూవీలో పుష్ప ఫ్రెండ్ క్యారెక్టర్‌లో నటించిన జగదీష్‌ ఓవర్ నైట్ స్టార్ గా మారాడు. పుష్ప సక్సెస్‌తో మంచి పాపులారిటి తెచ్చుకున్న జగదీష్‌కు దీని తర్వాత వరుస ఆవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే.. జగదీష్ ‘సత్తిగాని రెండెకరాలు’ సిరీస్‌లో హీరోగా కూడా నటించారు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో జగదీష్‌ను.. ఓ జూనియర్ మహిళా ఆర్టిస్ట్ మృతి కేసులో పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.

ప్రేమ పేరుతో ఆమెను వేధించి బ్లాక్ మెయిల్ చేయడంతో.. ఆమె సూసైడ్ చేసుకుందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో.. జగదీష్‌పై ఐపీసీ 306 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి ఆయనను 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. ఇది ఇలా ఉంటే.. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ‘పుష్ప 2’ మూవీకి.. జగదీష్ అరెస్ట్ తో బ్రేక్ పడింది అనే వార్తలు గుప్పుమంటున్నాయి. అతడితో చేయాల్సిన కొన్ని సన్నివేశాలను వాయిదా వేశారని సమాచారం. దీంతో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందా ? ఆగిపోతుందా? అనే ఊహాగానాలు మొదలైయ్యాయి.  ఇప్పుడు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.. అదేంటంటే..?  కేశవను (జగదీష్ పాత్ర పేరు) బయటకు తీసుకురానున్నారట.

పుష్ప 2 సినిమాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు.. జగదీష్ బెయిల్ కోసం యూనిట్ సభ్యులు ప్రయత్నిస్తున్నారనే విషయం ఆశక్తిని రేపింది. అయితే ఈ విషయంపై పుష్ప టీమ్ నుంచి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా, ఈ మూవీ దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్‌పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది. అయితే ఆ సన్నివేశాల్లో జగదీష్ ఉండాల్సిన అవసరం లేదని యూనిట్ వర్గాలు వెల్లడించినట్టు సమాచారం. ఇక పుష్ప 2 సినిమాకి జగదీష్ అరెస్ట్ తో ఎలాంటి సమస్యలు లేవని తెలుస్తోంది. కానీ, ఆయన బయటకు రావాడానికి చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తుందని టాక్ వినిపిస్తోంది. మరి, జగదీష్ అరెస్ట్ కారణంగా.. పుష్ప సినిమా ఇబ్బందులో పడటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio