iDreamPost
android-app
ios-app

బన్నీ, సుక్కుది 20 ఏళ్ళ బంధం.. గొడవ అయితే తప్పేంటి?

  • Published Jul 17, 2024 | 4:00 PM Updated Updated Jul 17, 2024 | 4:00 PM

Allu Arjun-Sukumar: తాజాగా బన్నీకి, సుకుమార్ కు మధ్య చిన్న పాటి డిస్టబెన్స్ వచ్చిందని దాంతో ఇద్దరు విదేశాలకు వెకేషన్ కు వెళ్లారని తెలుస్తోంది. అసలు సుకుమార్ కు బన్నీ మధ్య జరిగిన గొడవ ఏంటి? గొడవ అయితే తప్పేంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Allu Arjun-Sukumar: తాజాగా బన్నీకి, సుకుమార్ కు మధ్య చిన్న పాటి డిస్టబెన్స్ వచ్చిందని దాంతో ఇద్దరు విదేశాలకు వెకేషన్ కు వెళ్లారని తెలుస్తోంది. అసలు సుకుమార్ కు బన్నీ మధ్య జరిగిన గొడవ ఏంటి? గొడవ అయితే తప్పేంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  • Published Jul 17, 2024 | 4:00 PMUpdated Jul 17, 2024 | 4:00 PM
బన్నీ, సుక్కుది 20 ఏళ్ళ బంధం.. గొడవ అయితే తప్పేంటి?

పుష్ప 2.. గత కొంతకాలంగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సినిమా. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంతో బన్నీ ఫ్యాన్స్ తో పాటుగా సగటు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ.. షూటింగ్ ఆల్యం అవుతున్న కారణంగా ఆగస్ట్ 15న థియేటర్లలో రచ్చ చేయాల్సిన పుష్ప రాజ్ డిసెంబర్ 6కు షిప్ట్ అయ్యాడు. దాంతో ఫ్యాన్స్ నిరాశకు గురైయ్యారు. అదీకాక తాజాగా బన్నీకి, సుకుమార్ కు మధ్య చిన్న పాటి డిస్టబెన్స్ వచ్చిందని దాంతో ఇద్దరు విదేశాలకు వెకేషన్ కు వెళ్లారని తెలుస్తోంది. అసలు సుకుమార్ కు బన్నీ మధ్య జరిగిన గొడవ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పుష్ప 2 ను పార్ట్ 1 కంటే ఎంతో అద్భుతంగా తెరకెక్కించాలని డైరెక్టర్ సుకుమార్ ఆరాటపడుతున్నాడు. ఇందుకోసం రెండేళ్లుగా ప్రాణం పెట్టి పనిచేస్తున్నాడు అల్లు అర్జున్. అయితే అనుకోకుండా షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో.. బన్నీ కాస్త అసహనానికి లోనైయ్యాడు. ఇంకా 30 రోజుల షూటింగ్ పెండింగ్ ఉండటం, షూటింగ్ డీలే అవుతుండటంతో.. ఒకేసారి మూడు యూనిట్లను రంగంలోకి దింపి షూటింగ్  కంప్లీట్ చేయాల్సిందిగా బన్నీ సుకుమార్ కు సూచించాడట. దానికి సుక్కు.. కంగారు పడకు అన్నట్లుగా తెలుస్తోంది. ఈ చిన్ని విషయం కారణంగా ఇద్దరు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి విదేశాలు వెళ్లారు. ఇక బన్నీ ఇండియాకు తిరిగొస్తూ.. ఎయిర్ పోర్ట్ లో గడ్డం తీసేసి కనిపించడంతో.. అందరూ షాక్ కు గురైయ్యారు.

ఇదిలా ఉండగా.. బన్నీ, సుక్కు మధ్యన వచ్చిన గ్యాప్ టీ కప్పులో తుఫాన్ లాంటింది. ఎందుకంటే? వారి ఫ్రెండ్షిప్ ఇప్పటిది కాదు.. 20 ఏళ్ల నాటిది. సుక్కును బన్నీ ఎంతగా నమ్మాడో పుష్ప పార్ట్ 1 విజయం అప్పుడే అందరికి అర్ధమైయ్యేలా చెప్పాడు. సుకుమార్ లేకపోతే నేన ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని ఎమోషనల్ కూడా అయ్యాడు బన్నీ. అలాంటి వీరిద్దరి సాన్నిహిత్యంలో ఏవో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అంతమాత్రాన వీరి గొడవలను భూతద్దంలో పెట్టి చూడాల్సిన పనిలేదు. అన్నదమ్ముల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా.. వారి బంధం అలాగే ఉంటుంది. ఇప్పుడు బన్నీ-సుక్కు విషయంలో కూడా ఇదే జరుగుతుంది.

20 ఏళ్ల బన్నీ-సుక్కు బంధంలో ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు చూసి ఉంటారు చెప్పండి. పైగా వీరిద్దరు సినిమా పిచ్చొళ్లు. మూవీని అద్భుతంగా తెరకెక్కించడానికి పరితపించే కష్టజీవులు. అలాంటిది వీరి మధ్య చిన్న గొడవ జరిగితే తప్పేంటి? ఈ విషయాన్ని మీరు భూతద్దంలో పెట్టి చూడొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. గొడవ పడితే తప్పు.. కానీ సినిమా కోసం గొడవ పడితే.. అది పరిశ్రమకే మంచిది అంటూ మరికొందరు సోషల్ మీడియా వేదికగా రాసుకొస్తున్నారు. ఇక ఈ టీ కప్పులో తుఫాన్ ను వీలైనంతగా త్వరగా తప్పించి.. షూటింగ్ పూర్తి చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom