iDreamPost
android-app
ios-app

పుష్ఫ 2 నుండి ఫస్ట్ సింగిల్.. మాస్ జాతర ఖాయం

అల్లు అర్జున్- లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2. ఫస్ట్ సింగిల్ మే 1న విడుల చేశారు.

అల్లు అర్జున్- లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2. ఫస్ట్ సింగిల్ మే 1న విడుల చేశారు.

పుష్ఫ 2 నుండి ఫస్ట్ సింగిల్.. మాస్ జాతర ఖాయం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప-2. ఫస్ట్ సింగిల్ లిరికల్ ప్రోమోను ఏప్రిల్ 24న విడుదల చేసిన సంగతి విదితమే.. మే 1 సాయంత్రం 5.04 గంటలకు ఫుల్ సాంగ్ విడుదల చేస్తామని ప్రకటించింది. అనుకున్నట్లుగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. పుష్ప.. పుష్ప పుష్ప..పుష్ప రాజ్ సాగిపోయే పాటకు గూస్ బంప్స్ వస్తున్నాయి.‘నువ్వు గడ్డం అట్ట సవరిస్తుంటే.. దేశం దద్దరిల్లే..పుష్ప.. పుష్ప, నువ్వు భుజం ఎత్తి నడిసొస్తుంటే భూమే బద్దలు అయ్యే.. పుష్ప.. పుష్ప, నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే..నిన్ను కొలవాంటే సంద్రం ఇంకా లోతే తవ్వాలే.. పుష్ప..పుష్ప’ అంటూ ఎలివేషన్స్ ఇచ్చాడు.

కాగా, పుష్పలో తగ్గేదేలే అని గెడ్డం సవరించడం, భుజం ఎత్తి నడవడాన్ని హైలెట్ చేస్తూ సాంగ్ సాగుతోంది. దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు అందించిన ఈ పాటకు నఖాష్ ఆజీజ్, దీపక్ బ్లూ పాడారు. చంద్ర బోస్ రాసిన పాటకు ఒళ్లు పులకరించిపోతుంది. ప్రస్తుతం లిరిక్ సాంగే ఓ రేంజ్ లో ఉంది. కచ్చితంగా మాస్ జాతర స్టార్ట్ అయ్యింది.  ఈ పాటను పలు భాషల్లో విడుదల చేశారు. తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో రిలీజ్ అయ్యింది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి విదితమే. పహాద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, అజయ్, జగదీప్ ప్రతాప్ బండారీ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

ఇటీవల అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుకుని టీజర్ రిలీజ్ చేశారు. బన్నీ అమ్మవారి పాత్రలో మెప్పించాడు. ఇక తొలి సినిమాకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ సీక్వెల్ మూవీని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుకుమార్. ఆగస్టు 15న విడుదల చేసేందుకు సిద్దమైంది చిత్ర యూనిట్. ఇందులో ఊరమాస్ యాక్షన్ సీక్వెన్స్ ఉండనున్నాయని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకంపై నవీన్ ఏర్నేనీ, యలమంచిలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. అసలు సిసలైన పాన్ ఇండియా మూవీగా రాబోతుంది పుష్ప 2.

 

 

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobetgrandpashabet girişgrandpashabet resmi giriş