iDreamPost
android-app
ios-app

ఎట్టకేలకు పంచ్ ప్రసాద్​కు ఆపరేషన్ పూర్తి.. అండగా నిలిచిన AP సర్కారు!

  • Author singhj Published - 02:35 PM, Mon - 11 September 23
  • Author singhj Published - 02:35 PM, Mon - 11 September 23
ఎట్టకేలకు పంచ్ ప్రసాద్​కు ఆపరేషన్ పూర్తి.. అండగా నిలిచిన AP సర్కారు!

ప్రముఖ నటుడు, ‘జబర్దస్త్’ ఫేమ్ పంచ్ ప్రసాద్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు ఆపరేషన్ జరిగింది. ప్రసాద్​కు యశోద హాస్పిటల్​లో శస్త్ర చికిత్స జరిగిందని యూట్యూబ్ ద్వారా ఆయన భార్య సునీత తెలిపింది. ప్రస్తుతం ఈ స్టార్ కమెడియన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. రెండు కిడ్నీలు పాడైపోవడంతో కొన్నాళ్లుగా ఆయన డయాలసిస్ చేయించుకుంటూ వచ్చారు. అయితే ఆరోగ్యం విషమించడంతో ఆపరేషన్ ద్వారా కిడ్నీల మార్పిడి చేస్తేనే ఆయన ప్రాణాలు నిలుస్తాయని డాక్టర్లు చెప్పారు.

పంచ్ ప్రసాద్​ ఆపరేషన్​కు భారీగా ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఇదే విషయాన్ని మరో జబర్దస్త్ నటుడు నూకరాజు కొన్ని రోజుల కింద ఓ వీడియోలో చెప్పారు. కిడ్నీ ట్రాన్స్​ప్లాంటేషన్ కోసం భారీగా ఖర్చవుతుందని.. అంత ఖర్చును పంచ్ ప్రసాద్ భరించలేడని, ఎవరైనా సాయం చేయాలని ఆయన కోరిన విషయం విదితమే. ఆ టైమ్​లో ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి కూడా పంచ్ ప్రసాద్​కు రూ.లక్ష సాయం చేశారు. అలా పలువురు చేసిన ఆర్థిక సాయంతో పంచ్ ప్రసాద్ ఆపరేషన్ విజయవంతమైంది.

పంచ్ ప్రసాద్ హెల్త్ కండీషన్ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ దృష్టికి మంత్రి ఆర్కే రోజా గతంలోనే తీసుకెళ్లారు. ఈ మేరకు స్పందించిన జగన్.. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పంచ్ ప్రసాద్​కు ట్రీట్​మెంట్ అందించాలని ఆదేశించారు. యశోద హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న పంచ్ ప్రసాద్​కు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏపీ సర్కారు వైద్యం అందించింది. దీని మీద పంచ్ ప్రసాద్ స్పందిస్తూ.. అందరికీ థ్యాంక్స్ చెప్పారు. ఈ కష్టసమయంలో అందరూ అందించిన ప్రేమ, అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. మంత్రి రోజా సాయం చేశారని.. చికిత్సకు కావాల్సిన డబ్బులను సీఎంఆర్​ఎఫ్ ద్వారా సీఎం జగన్ మంజూరు చేశారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ‘లియో’ సాంగ్​పై సెన్సార్ కొరడా!