iDreamPost
android-app
ios-app

పెళ్లి పీటలు ఎక్కబోతున్న పల్సర్ బైక్ రమణ.. పెళ్లి కూతురు ఎవరంటే..?

  • Published Jan 05, 2024 | 12:33 PM Updated Updated Jan 05, 2024 | 12:33 PM

టాలెంట్ ఎవరు సొత్తు కాదూ అని నిరూపిస్తున్నారు జానపద కళాకారులు. తమ గేయాలతో అలరించారు.. అలరిస్తూనే ఉన్నారు. ఆ కోవలోకే వస్తారు పల్సర్ బైక్ రమణ. ఒక్క సాంగ్ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు అతడు..

టాలెంట్ ఎవరు సొత్తు కాదూ అని నిరూపిస్తున్నారు జానపద కళాకారులు. తమ గేయాలతో అలరించారు.. అలరిస్తూనే ఉన్నారు. ఆ కోవలోకే వస్తారు పల్సర్ బైక్ రమణ. ఒక్క సాంగ్ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు అతడు..

  • Published Jan 05, 2024 | 12:33 PMUpdated Jan 05, 2024 | 12:33 PM
పెళ్లి పీటలు ఎక్కబోతున్న పల్సర్ బైక్ రమణ.. పెళ్లి కూతురు ఎవరంటే..?

టాలెంట్ ఎక్కడ ఉన్నా ఏదో ఒక రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. అయితే త్వరగా జనాల్లోకి తీసుకెళ్లడానికి వేదికైంది మీడియా. ఎక్కడో జాన పదాలు, పల్లె పాటలు పాడుకునే ఓ యువకుడు.. ఓవర్ నైట్ స్టార్ అయ్యాడంటే కారణం..ఈ మీడియానే. అతడే పల్సర్ బైక్ రమణ. ‘నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాను బావో.. పల్సర్ బైక్ పైన రారా బావో’ అన్న సాంగ్ ఓ ఊపు ఊపేసింది. ఈ పాటను ఓషోలో కండక్టర్ ఝాన్సీ వేసిన డ్యాన్సుతో ఈ పాట జనాల్లో గుండెల్లోకి బాణంలో దూసుకెళ్లింది. ఈ పాటను తన గాత్రంతో ఉర్రూతలూగించాడు జానపద పాటల సింగర్ రమణ. ఈ పాటతోనే పల్సర్ బైక్ రమణ అనే పేరు పడింది. ఈ పేరు ధమాకా మూవీలో కూడా వినియోగించిన సంగతి విదితమే.

టాలెంటర్లను అందరికి పరిచయం చేసే షో శ్రీదేవీ డ్రామా కంపెనీ ద్వారా రమణ తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. ‘పొట్టిదాయి కాదమ్మో గట్టిదాయమ్మో’ ‘అబ్బబ్బ ఇది పిల్ల కాదురా.. పనస పండురా’, ఆ తర్వాత యాంకర్లపై పాడిన పాట సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా అతడికి పేరు వచ్చింది.  ఈ పాటలతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ప్రైవేట్ ఆల్చమ్స్ చేయడంతో పాటు పలు షోల్లో బాగా మరింత పాపులర్ అయ్యాడు ఈ విజయనగరం కుర్రాడు. ఈ మధ్య బేబి 2 పేరుతో షార్ట్ ఫిలిం కూడా చేశాడు. ఇప్పుడు ఈ రమణ మరో ప్రయాణంలోకి అడుగుపెడుతున్నాడు. డిసెంబర్ లో అతడి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశాడు.

కుందన శ్రీ (నందిని) అనే అమ్మాయితో అతడి నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో అందంగా ముస్తాబైన జంట.. స్టేజీపై ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. త్వరలోనే వీరి పెళ్లి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అలాగే అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş