Venkateswarlu
Venkateswarlu
ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం ప్రముఖ తమిళ నటుడు మారిముత్తు చనిపోయిన సంగతి తెలిసిందే. ఓ సినిమాకు డబ్బింగ్ చెబుతూ ఉండగా ఆయన గుండెపోటు కారణంగా మరణించారు. ఈ విషాదం మరువక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ముఖేష్ ఉదేశీ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే సోమవారం ఆయన ఆరోగ్యం క్షీణించింది. డాక్టర్లు ఆయన్ను రక్షించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చికిత్స పొందుతూ ముకేష్ ఉదేశీ తుది శ్వాస విడిచారు. ముఖేష్ ఉదేశీ మరణంపై సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తూ ఉన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కాగా, ముఖేష్ హిందీతో పాటు పలు తెలుగు సినిమాలకు కూడా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. చిరంజీవి హీరోగా హిందీలో వచ్చిన ప్రతిబంధ్, ది జెంటిల్ మ్యాన్ సినిమాలతో పాటు తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన ఎస్పీ పరుశురామ్ సినిమాను కూడా ఆయనే నిర్మించారు.
ముఖేష్‌కు టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్‌తో మంచి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖేష్‌కు చికిత్స విషయంలో అల్లు అరవింద్ సహాయం చేస్తూ ఉన్నారంట. కిడ్నీ ఆపరేషన్ చేయించడానికి కూడా సన్నాహాలు చేశారని ప్రముఖ సీనియర్ నిర్మాత ప్రవీణ్ సిప్పీ తెలిపారు. ఆపరేషన్ చేయించుకునే లోపే ముకేష్ మరణించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరి, ఇండస్ట్రీలో చోటుచేసుకుంటున్న వరుస విషాదాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.