Tirupathi Rao
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో ప్రియాంక జైన్ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే ఆమె ఇప్పుడు ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేసింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో ప్రియాంక జైన్ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే ఆమె ఇప్పుడు ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేసింది.
Tirupathi Rao
ప్రియాంక జైన్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జానకి కలగనలేదు సీరియల్ తో ఈ అమ్మడు అందరికీ సుపరిచితురాలు అయిపోయింది. ఆ తర్వాత వెంటనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఈమె ఆట, మాట, నడవడికతో బుల్లితెర ప్రేక్షకులకు ఇంట్లో మనిషిలా మారిపోయింది. స్టార్టింగ్ లో అందరూ పొట్టి పిల్ల అనుకున్నారు. కానీ, సీజన్ ముగిసే సరికి గట్టిపిల్ల అనే బిరుదును సొంతం చేసుకుంది. ప్రియాంక అంటే ఫైటర్ అని నిరూపించుకుంది. బిగ్ బాస్ తర్వాత తన లైఫ్ లో అద్భుతాలు జరుగుతాయని కలలు కనింది. కానీ, ఇలాంటి ఒక సంఘటన జరుగుతుందని ఊహించలేదు.
ప్రియాంక జైన్ కు బిగ్ బాస్ వల్ల మంచి ఫేమ్, ఫ్యాన్ బేస్ వచ్చాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ అమ్మడు కెరీర్ లో సెట్ అయిపోయింది. త్వరలోనే తన ప్రియుడు శివకుమార్ ని వివాహం కూడా చేసుకోబోతున్నాను అంటూ ప్రకటించింది. అన్నీ సజావుగా సాగిపోతున్నాయి అనుకునే సమయంలో ప్రియాంక జైన్ ఇంట ఊహించని ఘటన జరిగింది. తన తల్లికి సంబంధించిన ఒక బ్యాడ్ న్యూస్ ని తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. ప్రియాంక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఆమె తల్లి ఆరోగ్యం దెబ్బతిన్న విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్నారు. ప్రియాంక మాట్లాడుతూ.. “బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత లైఫ్ మొత్తం మారిపోతుంది అనుకున్నాను. కానీ, అమ్మ ఇలా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది.
అమ్మకు పిరియడ్స్ సమయంలో విపరీతమైన రక్తస్రావం అవుతోంది. 15 నుంచి 20 రోజుల వరకు బ్లీడింగ్ అయ్యేది. వయసు పైబడుతున్న సమయంలో ఇదంతా సాధారణే అనుకుంది. ఇటీవల ఆరోగ్య పరీక్షలు చేయిస్తే క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ లో ఉన్నట్లు గుర్తించారు. నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్న టైమ్ లోనే తనకు ఈ సమస్య స్టార్ట్ అయ్యింది. నన్ను బిగ్ బాస్ హౌస్ లో చూడాలి అని తను ఎలాంటి ఆస్పత్రులకు కూడా వెళ్లలేదు. నేను అసలు బిగ్ బాస్ కి వెళ్లకుండా ఉన్నా బాగుండేదేమో అనిపిస్తోంది. అమ్మకు గర్భాశయాన్ని తొలగిస్తే క్యాన్సర్ ఆగిపోయే ఛాన్స్ ఉందని చెప్పారు. తనకు లాపొరోస్కోపిక్ సర్జరీ చేయనున్నారు. అలా తన గర్భాశయాన్ని తొలగిస్తారు” అంటూ ప్రియాంక జైన్ కన్నీళ్లు పెట్టుకుంది.
ప్రియాంక జైన్ తల్లికి శస్త్రచికిత్స అయితే సక్సెస్ అయినట్లు వెల్లడించారు. రక్తం తక్కువగా ఉండటం వల్ల బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం ఎక్కించిన తర్వాత సర్జరీ చేశారు. ఆ తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేశారు. తల్లిని ఇంటికి తీసుకెళ్లి తన ఆనంద క్షణాలను పంచుకుంది. అదే వీడియోలో ప్రియాంక జైన్ కొన్ని సూచనలు కూడా చేసింది. శరీరంలో ఏ చిన్న మార్పులు వచ్చినా కూడా వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని కోరింది. తాము చేసిన తప్పు మాత్రం ఎవ్వరూ చేయద్దంటూ ప్రియాంక జైన్ రిక్వెస్ట్ చేసింది. ప్రియాంక జైన్ ఎమోషనల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.