టాలెంట్ ఉంటే ఎంత ఎత్తుకు అయినా ఎదగొచ్చని నిరూపించిన హీరోయిన్లలో ప్రియాంక చోప్రా ఒకరు. సౌత్ మూవీస్‌తో తన ఫిలిం జర్నీని ఆమె మొదలుపెట్టారు. ఆ తర్వాత బాలీవుడ్లో అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకున్నారు. ఆమె అందానికి, యాక్టింగ్ టాలెంట్‌కు హిందీ మూవీ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌తో పాటు అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోల సరసన ఎన్నో హిట్ చిత్రాల్లో ఆమె యాక్ట్ చేశారు. ప్రియాంక తమ సినిమాలో ఉంటే హిట్ గ్యారెంటీ అని హీరోలు నమ్మేవారు. అయితే పెళ్లి తర్వాత బాలీవుడ్‌కు ఆమె దూరమయ్యారు.
నిక్ జోనాస్‌ను మ్యారేజ్ చేసుకున్న తర్వాత బాలీవుడ్ కంటే హాలీవుడ్ మీదే ప్రియాంక ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ పలు టెలివిజన్ షోలు, వెబ్ సిరీస్‌లతో పాటు సినిమాల్లోనూ నటించే ఛాన్స్‌ను పిగ్గీ చాప్స్ దక్కించుకున్నారు. ‘సిటాడెల్’ సిరీస్‌తో హాలీవుడ్లో మంచి పాపులారిటీ దక్కించుకున్నారామె. వరుసగా అక్కడి ప్రాజెక్టుల్లో నటిస్తూ గ్లోబల్ స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. వరల్డ్ వైడ్‌గా తన ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంటున్నారు ప్రియాంక. అయితే ఈ అందాల రాశికి సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో వల్ల ప్రియాంకపై భారీగా విమర్శలు వస్తున్నాయి.
యూఎస్‌లోని లాస్ ఏంజిల్స్‌లో 2016లో జరిగిన ఎమ్మీ అవార్డ్స్ ఈవెంట్‌కు ప్రియాంక అటెండ్ అయ్యారు. అక్కడ ఒక యాంకర్ భారతీయ సినిమాలపై తన అభిప్రాయం చెప్పాలని ప్రియాంకను అడిగారు. యాంకర్ అడిగిన క్వశ్చన్‌కు తడుముకోకుండా వెంటనే ఇండియన్ సినిమాలన్నీ ఆడవాళ్ల ప్రైవేట్ పార్ట్స్ గురించే ఉంటాయనే అర్థం వచ్చేలా ఆమె వ్యాఖ్యలు చేశారు. ఒకరకంగా ఎక్స్పోజింగ్ తప్ప మన సినిమాల్లో ఏమీ ఉండదనే అర్థం వచ్చేలా చెప్పుకొచ్చారు ప్రియాంక. అది పాత వీడియోనే అయినప్పటికీ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీన్ని చూసిన మూవీ లవర్స్ పిగ్గీ చాప్స్పై విమర్శలకు దిగుతున్నారు. మరి.. భారతీయ సినిమాలపై ప్రియాంక చేసిన కామెంట్స్ మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.