iDreamPost
android-app
ios-app

త్వరలో ప్రియుడితో పెళ్లి పీటలెక్కనున్న హీరోయిన్ ప్రియా భవానీ!

  • Published Aug 08, 2024 | 12:43 PM Updated Updated Aug 08, 2024 | 12:54 PM

Priya Bhavani Shankar: ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. అలానే మరికొందరు తమ పెళ్లికి సంబంధించి కీలక ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా ఓ బ్యూటీ తన వివాహం గురించి ఆసక్తికరమైన విషయం చెప్పింది.

Priya Bhavani Shankar: ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. అలానే మరికొందరు తమ పెళ్లికి సంబంధించి కీలక ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా ఓ బ్యూటీ తన వివాహం గురించి ఆసక్తికరమైన విషయం చెప్పింది.

  • Published Aug 08, 2024 | 12:43 PMUpdated Aug 08, 2024 | 12:54 PM
త్వరలో ప్రియుడితో పెళ్లి పీటలెక్కనున్న హీరోయిన్ ప్రియా భవానీ!

ఇటీవల కాలంలో పలువురు సెలబ్రిటీలు..వారి అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతున్నారు. పెళ్లి, పిల్లలు వంటి పలు అంశాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. తమ ఎంగెజ్మెంట్ , వెడ్డింగ్ కు సంబంధించిన విశేషాలను సెలబ్రిటీలు షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ టాప్ హీరోయిన్ తన పెళ్లి గురించి కీలక ప్రకటన చేసింది. తన ప్రియుడిని పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించింది. మరి.. ఆ హీరోయిన్ ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఇటీవలే విశ్వనటుడు కమలహాసన్ నటించిన భారతీయుడు -2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేదు. అయితే ఈ సినిమాలో నటి ప్రియా భవానీ మాత్రం మెరిసింది. తన నటనతో  ఆడియన్స్ నుంచి మంచి మార్కులో సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ గోపిచంద్ నటించిన భీమా సినిమాలో కూడా నటించింది. అలానే సంతోష్ శోభన్ తో కల్యాణం కమనీయం అనే సినిమాలో జోడి కట్టింది ఈ కోలీవుడ్ బ్యూటీ.  నాగచైతన్య నటించిన ధూత వెబ్ సిరీస్ తో టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ అమ్మడు బాగా దగ్గరైంది.  ఇప్పటికే కోలీవుడ్ హీరోలు విశాల్, ధనుష్, శింబు, కార్తీ వంటి వారితో ఆమె జోడీ కట్టింది. ఆగష్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా  డీమాంటీ కాలనీ 2 సినిమాతో ప్రేక్షకుల ముందు రానుంది.

ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రియా భవానీ  శంకర్ తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజ్వేల్ రాజ్ అనే వ్యక్తితో తాను పదేళ్లుగా రిలేషన్ లో ఉన్నానని ఈ బ్యూటీ ఓపెన్ అయింది. సినీ ఇండస్ట్రీలోకి రాక ముందు నుంచి రాజ్వేల్ తో తాను లవ్ లో ఉన్నట్లు భవానీ తెలిపింది. ఇదే సమయంలో ఈ బ్యూటీపై పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రియుడితో డేటింగ్ పై  ఇంట్రస్ట్ చూపుతున్న ఈ బ్యూటీ పెళ్లికి మాత్రం ఆలోచించడం లేదనే టాక్ వైరల్ అయ్యింది. దీంతో వారిద్దరూ విడిపోయరంటూ కూడా చాలా సార్లు వార్తలు వచ్చాయి.

తాను చాలా మంది హీరోలతో నటించడం వల్ల ..వారికి బర్త్ డే విషేష్ చెప్పినా కూడా వెంటనే తప్పుగా ప్రచారం చేశారని తెలిపింది. కాలేజీ చదువుకునే రోజుల్లోనే పెళ్లి ప్రస్తావన వచ్చి ఉంటే.. రాజ్ తో ఈ పాటికే వివాహం జరిగి ఉండేదని ఆమె తెలిపారు. 2025లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రియా భవానీ శంకర్ తెలిపారు. తన జీవితంలోకి రాజ్  రావడం ఎంతో అదృష్ం అని ఈ బ్యూటీ తెలిపింది. రాజ్ లేకుంటే.. ఇప్పటికీ తాను మిడిల్ క్లాస్  అమ్మాయిగానే మిగిలిపోయేదాన్ని తెలిపింది. రాజ్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే సినీ ఇండస్ట్రీలో రాణించి.. ఈ స్థాయికి వచ్చాని చెప్పుకొచ్చింది. మొత్తంగా తాను వచ్చే ఏడాది తన ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలిపింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet