రాబోయే 2024 సంక్రాంతి సీజన్ చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. ఎందుకంటే.. ఈసారి ఒకటి రెండు పెద్ద సినిమాలు కాదు. ఏకంగా ఆరు సినిమాల వరకు పెద్దవే రిలీజ్ కాబోతున్నాయి. వీటితో పాటు చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలు ఉండనే ఉన్నాయి. అన్ని కలిపి కేవలం మూడు రోజుల్లో పదికి పైగా రిలీజ్ అవుతున్నాయంటే.. బాక్సాఫీస్ వద్ద వార్ ఎలా ఉండబోతుందో మీరే అర్ధం చేసుకోండి. ఇప్పటివరకు సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం.. ప్రశాంత్ వర్మ హనుమాన్.. రవితేజ డెవిల్.. నాగార్జున నా సామిరంగా.. వెంకటేష్ సైందవ్.. విజయ్ దేవరకొండ – పరశురామ్ సినిమా.. డైరెక్ట్ తెలుగు రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాలు.
ఇవేగాక సంక్రాంతి సీజన్ కోసం ఎదురుచూసే చిన్న సినిమాలు లైన్ లో ఉన్నాయి.. వాటితో పాటు పలు ఆసక్తికరమైన డబ్బింగ్ సినిమాలు కూడా లైన్ లో ఉండటం విశేషం. ప్రతీ ఏడాది సంక్రాంతి సీజన్ వస్తుందంటే చాలు.. సినీ ప్రేక్షకులలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఎందుకంటే.. ఓవైపు హాలిడేస్.. మరోవైపు కొత్త సినిమాలు.. ఇంకేం కావాలి హ్యాపీగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి సినిమాలకు వెళ్లొచ్చు అని ముందునుండి ప్రిపేర్ అవుతుంటారు జనాలు. అలా ఇండస్ట్రీ వాళ్ళు కూడా తమ కొత్త సినిమాలు ఎలాంటి పోటీ ఉన్నా.. రిలీజ్ చేయాలని ఆరాటపడుతుంటారు. ఎందుకంటే.. సినిమాకి హిట్ టాక్ వచ్చినా, రాకపోయినా జనాలు పండుగ సెలవులలో సినిమాలైతే చూస్తారు.
ఇక సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు డేట్స్ ఓకే చేసుకున్న సినిమాలు ఎంతవరకు పోటీలో ఉంటాయి అనేది చర్చనీయంశంగా మారింది. ఇప్పుడున్న పెద్ద సినిమాలలో ఏ ఒక్కటీ కూడా సైడ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే.. ఆల్రెడీ కొన్ని వాయిదా పడి ఆ డేట్ కి ఫిక్స్ అయ్యాయి. ఇంకొన్ని ముందునుండి సంక్రాంతికే రావాలని పట్టుబట్టాయి. మరికొన్ని వేరే పాన్ ఇండియా మూవీస్ కారణంగా సంక్రాంతికి షిఫ్ట్ అయ్యాయి. సో.. ఇప్పుడు సంక్రాంతి టెన్షన్ అంతా ముందునుండి డేట్స్ లాక్ చేసుకున్న సినిమాలకు కాదు. వెనుక వెళ్లిన సినిమాలకే అని సినీ వర్గాల టాక్. ఒత్తిడి సినిమాలకంటే ఎక్కువ ప్రొడ్యూసర్స్ పై ఉంది. కొందరు ప్రొడ్యూసర్స్ వేరే సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ లో భాగమై ఉన్నారు. సో.. సొంత సినిమాలు, డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న సినిమాలు మేనేజ్ చేయాలంటే.. ఖచ్చితంగా ఒత్తిడి అనేది వేరే సినిమాలపై పడుతుంది. మరి 2024 సంక్రాంతి పోటీలో ఉండేవి ఏవో.. ఆ టైమ్ కి షిఫ్ట్ అయ్యేవి ఏవో చూడాలి.