iDreamPost
android-app
ios-app

లావణ్య నన్ను బ్లాక్ మెయిల్ చేస్తోంది.. సంచలన ఆరోపణలు చేసిన ప్రీతి!

  • Published Aug 03, 2024 | 5:35 PM Updated Updated Aug 03, 2024 | 5:35 PM

Raj Tarun, Lavanya: గతకొంత కాలంగా టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య మధ్య వివాదం నడుస్తోంది. ఈ ఇష్యూలో రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది. తాజాగా ప్రీతి అనే మహిళ లావణ్యపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

Raj Tarun, Lavanya: గతకొంత కాలంగా టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య మధ్య వివాదం నడుస్తోంది. ఈ ఇష్యూలో రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది. తాజాగా ప్రీతి అనే మహిళ లావణ్యపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

  • Published Aug 03, 2024 | 5:35 PMUpdated Aug 03, 2024 | 5:35 PM
లావణ్య నన్ను బ్లాక్ మెయిల్ చేస్తోంది.. సంచలన ఆరోపణలు చేసిన ప్రీతి!

ప్రస్తుతం టాలీవుడ్ లో హీరో రాజ్ తరుణ్ , లావణ్యల మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి..శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ లావణ్య..రాజ్ పై ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో రాజ్ తరుణ్ కూడా లావణ్యపై పలు ఆరోపణలు చేశారు. ఇలా వీరి వివాదం కొనసాగుతున్న సమయంలో రాజ్ తరుణ్ కి సన్నిహితుడైన ఆర్ జే శేఖర్ బాషా..లావణ్యపై సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ప్రీతి, ఉదయ్ లాంటి ఎంతో మందికి డ్రగ్స్ అలవాటు చేసిందన్నాడు. ఇదే సమయంలో ప్రీతికి సంబంధించిన కొన్ని వీడియోలను లావణ్య బయటపెట్టి..ఆమెకు కూడా ప్రీతిపై పలు విమర్శలు చేసింది.

రాజ్ తరుణ్, లావణ్యల వివాదం ఇలా సాగుతున్న క్రమంలో తాజాగా ప్రీతి అనే యువతి తెరపైకి వచ్చింది. అంతేకాక లావణ్యపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. ఏకంగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి లావణ్యపై ఫిర్యాదు చేసింది. లావణ్య తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని, ఆమె వలన తనకు ప్రాణహానీ ఉందని ప్రీతి చెప్పుకొచ్చింది. తనకు డ్రగ్స్ అలవాటు చేసింది లావణ్యనే అని, తనతో పాటు ఎంతో మందికి కూడా ఈ డ్రగ్స్ ను ఇచ్చిందని ప్రీతి ఆరోపించింది. ఇక లావణ్య విషయాలు బయటపెడితే.. తమ వ్యక్తిగత వీడియోలను బయటపెడతానని బెదరించినట్లు ప్రీతి తెలిపింది.

ఇప్పటికే ఉదయ్ ఫోన్ లావణ్య దగ్గరే ఉందని, అందులోని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానంటూ లావణ్య బ్లాక్ మెయిల్ చేస్తోందని ప్రీతి తెలిపింది. లావణ్య ఎంతో మందికి డ్రగ్స్ సప్లయ్ చేసిందని, ఆమె ప్రవర్తన చాలా దారుణంగా ఉండేదని తెలిపింది. మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తానంటూ బెదిరించేందని, ఇప్పుడు కూడా నేను బయటికి వచ్చేదాన్ని కాదని, లావణ్య తన పేరును ప్రస్తావించడం కారణంగా రావాల్సి వచ్చిందని ప్రీతి తెలిపింది. కొన్ని రోజుల నుంచి తనను బ్లాక్ మెయిస్ చేస్తోందని, ఈ క్రమంలోనే తాను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని ప్రీతి అన్నారు.

గతంలో తమ మైండ్ మార్చి.. ఆమె కోసం ఫైట్ చేయించిన రోజులు చాలానే ఉన్నాయని ప్రీతి ఆరోపించింది.  లావణ్య కారణంగా తాను చాలా టార్చర్ అనుభవించానంటూ.. అనేక విషయాలను ప్రీతి వెల్లడించింది. మొత్తంగా రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో తాజాగా ప్రీతి అనే మహిళ తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు లావణ్య..రాజ్ తరుణ్ తో పాటు మరికొందరిపై ఫిర్యాదు చేయగా..ఈ సారి ఆమెపైనే ప్రీతి, ఉదయ్ లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం లావణ్యపై ప్రీతి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio