Venkateswarlu
ప్రశాంత్ నీల్ భార్య లిఖితా రెడ్డి నీల్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టు వైరల్‌గా మారింది.
ప్రశాంత్ నీల్ భార్య లిఖితా రెడ్డి నీల్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టు వైరల్‌గా మారింది.
Venkateswarlu
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకుడు ఎంతగానో ఎదురు చూసిన ‘సలార్’ సెకండ్ ట్రైలర్ రానే వచ్చింది. సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటల తర్వాత యూట్యూబ్‌లోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ట్రైలర్ విడుదల అయింది. తెలుగు ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన 48 నిమిషాల్లోనే దాదాపు 1.6 మిలియన్ల వ్యూస్‌ను సంపాదించింది.
సలార్ ఫస్ట్ ట్రైలర్ రికార్డును ఇది తుడిచి పెట్టేలా కనిపిస్తోంది. మొదటి ట్రైలర్ యూట్యూబ్‌లోకి వచ్చిన 18 గంటల్లోనే 100 మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టింది. ఇప్పటి వరకు ఏకంగా 175 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. సలార్ సెకండ్ ఈ రికార్డులను బ్రేక్ చేస్తుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే.. ట్రైలర్ విడుదల విషయంలో దాదాపు 24 గంటలకు పైగా సస్పెన్స్ నడిచింది. ఈ ట్రైలర్ ఆదివారం సాయంత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండింది. అయితే, సాంకేతిక సమస్యల కారణంగా సోమవారానికి వాయిదా పడింది.
సోమవారం ఉదయం 10.42 నిమిషాలకు బయటకు రావాల్సింది. కానీ, అప్పుడు కూడా సాంకేతిక కారణాల వల్ల ట్రైలర్ విడుదల వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు సినిమా టీం తెలిపింది. అప్పటికే తీవ్ర అసహనంతో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకుడికి మళ్లీ దెబ్బ తగిలింది. ట్రైలర్ మూడో సారి వాయిదా పడింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు సలార్ టీమ్‌పై మండిపడటం మొదలుపెట్టారు.
వారిలో సలార్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ భార్య కూడా చేరిపోయారు. ప్రశాంత్ భార్య లిఖితా రెడ్డి సలార్ ట్రైలర్ వరుసగా వాయిదా పడ్డంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టుపై భర్తపై మండిపడ్డారు. ‘‘ ప్రశాంత్ నీల్ …’’ అంటూ కోపంగా ఉన్న ఎమోజీలను యాడ్ చేశారు. అయితే, ఆమె ఆ పోస్టు పెట్టిన కొన్ని నిమిషాలకే ట్రైలర్ విడుదల అయింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఆలస్యం అయినా సరే అద్భుతమైన ట్రైలర్ ఇచ్చారంటూ సంతోష పడుతున్నారు.
కాగా, సలార్ డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అవ్వనుంది. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రీ బుకింగ్స్ విషయంలో సలార్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. కానీ, తెలుగు బుకింగ్స్ ఇంకా మొదలవ్వలేదు. మరి, సలార్ ట్రైలర్ విడుదల విషయంలో ప్రశాంత్ నీల్ భార్య ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.