iDreamPost
android-app
ios-app

అరుదైన రికార్డ్ ను క్రియేట్ చేసిన ‘ప్రసన్నవదనం’ మూవీ!

  • Published May 28, 2024 | 1:54 PM Updated Updated May 28, 2024 | 1:54 PM

Prasanna Vadanam Movie: కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. అందుకు అనేక సినిమాల్లో ఉదాహరణ. తాజాగా అలా కంటెంట్ బలంగా ఉన్న ప్రసన్నవదనం సినిమా అరుదైన రికార్డ్ ను క్రియేట్ చేసింది.

Prasanna Vadanam Movie: కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. అందుకు అనేక సినిమాల్లో ఉదాహరణ. తాజాగా అలా కంటెంట్ బలంగా ఉన్న ప్రసన్నవదనం సినిమా అరుదైన రికార్డ్ ను క్రియేట్ చేసింది.

  • Published May 28, 2024 | 1:54 PMUpdated May 28, 2024 | 1:54 PM
అరుదైన రికార్డ్ ను క్రియేట్ చేసిన ‘ప్రసన్నవదనం’ మూవీ!

సినీ ప్రపంచంలో ఎన్నో సినిమాలు విడుదలవుతుంటాయి. వీటికలో కొన్ని చాలా రోజుల పాటు థియేటర్లో సందడి చేయగా, మరికొన్ని మాత్రం అలావచ్చి ఇలా వెళ్లిపోతుంటాయి. ఇది ఇలా ఉంటే.. చాలా మంది తమ సినిమాలకు అన్యాయం జరిగింది, కథ బాగున్న ఎవరు రావడం లేదంటూ వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. అందుకు అనేక సినిమాల్లో ఉదాహరణ. తాజాగా అలా కంటెంట్ బలంగా ఉన్న ప్రసన్నవదనం సినిమా అరుదైన రికార్డ్ ను క్రియేట్ చేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

కంటెంట్ ఉన్న సినిమాలు అనేక రికార్డులు సృష్టిస్తుంటాయి. అలాంటి మూవీస్ రావడం సెలెంట్ గా వచ్చిన బాక్సాఫీస్ వద్ద  వసూళ్ల దండయాత్ర చేస్తాయి. అంతేకాక పలు రికార్డులను సైతం సృష్టిస్తుంటాయి. అలానే ఓటీటీలో కూడా తమ హవాను చూపిస్తాయి. తాజాగా ప్రసన్నవదనం అలాంటి ఓ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. యంగ్ హీరో సుహాస్ హీరోగా నటించిన ప్రసన్నవదనం మూవీ ఇటీవలే థియేటర్లలోకి వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో  ఈ మూవీని యంగ్ డైరెక్టర్ అర్జున్ వైకే తెరకెక్కించారు. ఫేస్ బ్లైండ్ నెస్ అనే కొత్త కథతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. టీజర్, ట్రైలర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో థియేటర్లలోకి సైలెంట్ గా వచ్చి..సూపహ్ హిట్ గా నిలిచింది ఈ మూవీ.

మే 3న విడుదలైన ఈ సినిమాకు ఐపీఎల్, ఎన్నికల ఎలక్షన్స్ హడావుడి కారణంగా అనుకున్నంత ఆదరణ దక్కలేదు. అందుకే అనుకున్న సమయం కంటే చాలా ముందుగానే ఓటీటీలో విడుదల చేశారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ప్రసన్నవదనం స్ట్రీమింగ్ చేసింది.  బాక్సాఫీస్ దగ్గర అనుకున్న అంత ఆదరణ రాకపోయినా ఓటీటీలో మాత్రం అనూహ్య స్పందన వచ్చింది. ఓటీటీలో విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయిలో వ్యూస్ సంపాదించింది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాక ఇదే సమయంలో ప్రసన్నవదనం అరుదైన ఘనతను తన ఖాతాల్లో వేసుకుంది. ఆహాలో 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్‌ను క్రాస్ చేసింది. ఓటీటీలో విడుదలైన చాలా తక్కువ సమయంలో 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్‌ క్రాస్ చేసిన సినిమాగా సుహాస్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే విషయం ఆహా సంస్థ అధికారికంగా ప్రకటించింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş