iDreamPost
android-app
ios-app

ఈ పాప ఇప్పుడు హీరోయిన్.. ఒక్క హిట్ పడితే రష్మికని దాటిపోద్ది!

  • Published May 03, 2024 | 5:17 PM Updated Updated May 03, 2024 | 5:17 PM

కోల్గేట్ యాడ్ లోలా చిరునవ్వులు చిందిస్తున్న ఈ పాప.. హీరోయిన్ గా రాణిస్తోంది. తన హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అవకాశాలు ఉన్నా. . సక్సెస్ కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే...

కోల్గేట్ యాడ్ లోలా చిరునవ్వులు చిందిస్తున్న ఈ పాప.. హీరోయిన్ గా రాణిస్తోంది. తన హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అవకాశాలు ఉన్నా. . సక్సెస్ కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే...

  • Published May 03, 2024 | 5:17 PMUpdated May 03, 2024 | 5:17 PM
ఈ పాప ఇప్పుడు హీరోయిన్.. ఒక్క హిట్ పడితే రష్మికని  దాటిపోద్ది!

పాపులారిటీతో పాటు నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనుకునే వారికి ది బెస్ట్ ఛాయిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇందులో అవకాశాలు వచ్చి, ఒక్కసారి క్లిక్ అయితే చాలు.. వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నా, ఎంతో కష్టమైన వైద్య విద్యను చదివి, డాక్టర్ కాకుండా యాక్టర్స్ అయిన నటీనటులను చూశాం. అయితే కొన్ని సార్లు అనుకున్నవీ అనుకున్నట్లు జరగవు. కొంత మంది త్వరగా క్లిక్ అయితే.. మరికొంత మంది స్లోగా హార్ట్‌కు టచ్ అవుతూ ఉంటారు.సక్సెస్, ఫెయిల్యూర్స్ పట్టించుకోకుండా.. వచ్చిన ఛాన్సులు అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ బ్యూటీ కూడా ఈ తరహా నటే. ఐదేళ్ల నుండి ఇండస్ట్రీలో ఉన్నా.. సరైన సక్సెస్ రాకపోయినా.. వెనకడుగు వేయలేదు.

ఫోనులో మాట్లాడుతూ.. ఫోటోకు ఫోజులిస్తున్న ఈ చిన్నారి గురించే ఇప్పుడు చెప్పుకునేది.. సక్సెస్ మొహం తెలియదు.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇండిగో ఎయిర్ లైన్స్‌లో వర్క్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ రంగంపై ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలి పెట్టి.. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అటు నుండి సినీ ఇండస్ట్రీలోకి వచ్చి..స్టార్ హీరోయిన్‌గా నిలదొక్కుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది. అమ్మడిలో గుమ్మడికాయంత అందం ఉన్నా..చింత పిక్క అదృష్టం కలిసి రాక.. సరైన గుర్తింపు రావట్లేదు కానీ.. గ్లామర్ క్వీన్‌కు ఏ మాత్రం తీసిపోదు. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే రాశీ సింగ్. తాజాగా సుహాస్ హీరోగా వచ్చిన ప్రసన్నవదనం మూవీతో పలకరించింది. 2016 నుండి పరిశ్రమలో హిట్ కోసం పరితపిస్తోంది. 2019లో సాయి రామ్ శంకర్ హీరోగా వచ్చిన రీసౌండ్ అనే మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

 ఈ రీసౌండ్ తన కెరీర్‍కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఆ తర్వాత పోస్టర్, జెమ్ అనే చిత్రాల్లో నటించింది. 2021లో వచ్చిన శశి కాస్తో, కూస్తో గుర్తింపు వచ్చింది. 2023లో యంగ్ టాలెంట్ హీరో సంతోష్ శోభన్ కథానాయకుడిగా వచ్చిన ప్రేమ్ కుమార్ చిత్రంలో నేత్రగా అలరించింది. కానీ పిక్చర్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇదే సంవత్సరంలో వచ్చిన భూతద్దం భాస్కర్ నారాయణ పర్వాలేదు అనిపించుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. పాపం పసివాడు అనే వెబ్ సిరీస్‌లో కూడా మెరిసింది. తాజాగా ప్రసన్నవదనంలో కనిపించింది. ఇప్పుడు ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా హాట్ ఫోజులతో కుర్రకారును నిద్ర లేకుండా చేస్తోంది ఈ బ్యూటీ.  ఇక ప్రసన్న వదనం హిట్ కొడితే.. అమ్మడు రష్మికను మించిపోయే స్టార్ హీరోయిన్‌గా మారడం ఖాయమే.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbenjaminsbet girişgrandpashabet