iDreamPost
android-app
ios-app

సందీప్ వంగా కోసం ప్రభాస్ మారతాడా? ఆ సవాల్​ను డార్లింగ్ ఎలా అధిగమిస్తాడో?

  • Published Sep 17, 2024 | 9:58 PM Updated Updated Sep 17, 2024 | 10:29 PM

Prabhas, Sandeep Reddy Vanga, Spirit Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ‘కల్కి 2898 ఏడీ’ సక్సెస్ ఇచ్చిన జోష్​తో తన పైప్​లైన్​లో ఉన్న మూవీ షూటింగ్స్​లో ఎక్స్​ట్రా ఎనర్జీతో వర్క్ చేస్తున్నాడు.

Prabhas, Sandeep Reddy Vanga, Spirit Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ‘కల్కి 2898 ఏడీ’ సక్సెస్ ఇచ్చిన జోష్​తో తన పైప్​లైన్​లో ఉన్న మూవీ షూటింగ్స్​లో ఎక్స్​ట్రా ఎనర్జీతో వర్క్ చేస్తున్నాడు.

  • Published Sep 17, 2024 | 9:58 PMUpdated Sep 17, 2024 | 10:29 PM
సందీప్ వంగా కోసం ప్రభాస్ మారతాడా? ఆ సవాల్​ను డార్లింగ్ ఎలా అధిగమిస్తాడో?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ‘కల్కి 2898 ఏడీ’ సక్సెస్ ఇచ్చిన జోష్​తో తన పైప్​లైన్​లో ఉన్న మూవీ షూటింగ్స్​లో ఎక్స్​ట్రా ఎనర్జీతో వర్క్ చేస్తున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్​’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు డార్లింగ్. ‘సలార్ 2’తో పాటు ‘కల్కి 2898 ఏడీ’ సెకండ్ పార్ట్ లైన్​లో ఉన్నాయి. వీటితో పాటు సెట్స్​ మీదకు వెళ్లడానికి ముందే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ‘స్పిరిట్’ మూవీ పైప్​లైన్​లో ఉంది. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్​లో ఉన్న ఈ సినిమా గురించి బయటకు వస్తున్న ఒక్కో ఇంట్రెస్టింగ్ అప్​డేట్ చిత్రం మీద అంచనాలను ఆకాశానికి తగిలేలా చేస్తోంది. ఈ తరుణంలో ‘స్పిరిట్’కు సంబంధించి మరో విషయం బయటకు వచ్చింది. ప్రభాస్​కు ఛాలెంజ్ విసురుతున్న ఆ మ్యాటర్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

‘స్పిరిట్’ స్టోరీని కంప్లీట్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. డైలాగ్ వెర్షన్​ను పెండింగ్​లో పెట్టాడని వినిపిస్తోంది. డైలాగ్స్ విషయంలో తన స్టైల్ రైటింగ్​కు తగ్గట్లు ప్రభాస్ తనను తాను మార్చుకుంటాడా? అనే విషయం డైరెక్టర్​ను ఆలోచనల్లో పడేసిందట. తనకు తగ్గట్లు డార్లింగ్ మారతాడా? లేదా ఆయనకు సూట్ అయ్యేలా పొడి పొడి డైలాగ్స్​తో తాను రైటింగ్​ను మార్చుకోవాలా? అనే మీమాంసలో ఉన్నాడట సందీప్ వంగా. కెరీర్ బిగినింగ్ నుంచి డిఫరెంట్ మూవీస్​లో యాక్ట్ చేస్తూ ఆడియెన్స్​తో పాటు మూవీ లవర్స్​ మనసుల్ని దోచుకుంటున్న ప్రభాస్.. మొదట్నుంచి ఒక విషయంలో మాత్రం పెద్ద మార్పులు చేయలేదు. అదే డైలాగ్స్. పొడి పొడి డైలాగ్స్ చెబుతూ, తన కటౌట్​తో ఎక్కువగా మాట్లాడటం ప్రభాస్ స్టైల్. అలాగని డైలాగ్స్ విషయంలో ఏనాడూ తగ్గలేదు. ఆయన కెరీర్​లో ఎన్నో హిట్ డైలాగ్స్ ఉన్నాయి. అయితే వాటిల్లో షార్ట్ అండ్ స్వీట్​వే ఎక్కువ. ‘బాహుబలి’ సిరీస్ ఇందుకు మినహాయింపు అనే చెప్పాలి.

‘బాహుబలి’ సిరీస్​లో లెంగ్తీ డైలాగ్స్​ను కూడా అలవోకగా చెప్పి అలరించాడు ప్రభాస్. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్​లో యుద్ధం సమయంలో ‘ఏది మరణం’ అంటూ ఆయన చెప్పే సంభాషణల్ని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. జక్కన్న చిత్రం కోసం పాత పంథాను పక్కనబెట్టి భారీ డైలాగ్స్ చెప్పిన రెబల్ స్టార్.. ఆ తర్వాత మళ్లీ ఓల్డ్ స్టైల్​ను ఫాలో అవుతున్నాడు. తక్కువ లెంగ్త్ ఉండే డైలాగ్స్​ను తనదైన మేనరిజమ్స్​తో చెబుతూ అలరిస్తున్నాడు. అయితే సందీప్ వంగా కోసం ఆయన ఇప్పుడు మళ్లీ పంథా మార్చుకోవాల్సిన టైమ్ వచ్చినట్లే కనిపిస్తోంది.

సందీప్ రెడ్డి మూవీస్​లో లెంగ్తీ డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయి. వాటిల్లో హీరోలు హైఫై భాషతో, మెడికల్ టెర్మినాలజీ వాడుతూ అనర్గళంగా మాట్లాడటం తెలిసిందే. డైలాగ్స్ చెప్పే టైమ్​లో యాటిట్యూడ్ కూడా స్పెషల్ అట్రాక్షన్​గా నిలుస్తూ ఉంటుంది. ప్రభాస్ సినిమాల్లో ఈ తరహా డైలాగ్స్ అంటే ‘బుచ్చిగాడు’, ‘ఏక్ నిరంజన్’లో చూడొచ్చు. కానీ సందీప్ వంగా మూవీస్​లో హీరోలు మరింత ఫోర్స్, ఎనర్జీతో డైలాగ్స్ చెబుతూ ఉంటారు. అందునా ‘స్పిరిట్’లో హీరోది పోలీస్ గెటప్ కాబట్టి సెక్షన్స్​ను డైరెక్టర్ హైలైట్ చేయొచ్చు. కాబట్టి ప్రభాస్ లెంగ్తీ డైలాగ్స్​కు అలవాటు పడాలి. అలాగే బిగ్గరగా, యాటిట్యూడ్​తో హైఫై లాంగ్వేజ్​లో చెప్పాల్సి ఉంటుంది. ఈ ఛాలెంజ్​ను ప్రభాస్ ఎలా దాటుతాడో చూడాలి.