Nidhan
Jr NTR, Devara Movie, Devara In Nizam: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం మరో 10 రోజుల్లో బిగ్ స్క్రీన్స్‌లోకి రానుంది. అప్పటివరకు అభిమానులు, ప్రేక్షకులు ఓపిక పట్టేలా లేరు. తారక్ మాస్‌ను చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Jr NTR, Devara Movie, Devara In Nizam: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం మరో 10 రోజుల్లో బిగ్ స్క్రీన్స్‌లోకి రానుంది. అప్పటివరకు అభిమానులు, ప్రేక్షకులు ఓపిక పట్టేలా లేరు. తారక్ మాస్‌ను చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Nidhan
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ దండయాత్రకు సమయం దగ్గర పడుతోంది. ఆయన నటించిన ‘దేవర’ చిత్రం సందడి ఇంకో 10 రోజుల్లో మొదలవనుంది. ‘అరవింద సమేత’ లాంటి సూపర్ హిట్ తర్వాత తారక్ సోలోగా వస్తున్న మూవీ కావడం, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫిల్మ్ నుంచి బయటకు వచ్చిన టీజర్స్, సాంగ్స్, ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ రావడంతో ‘దేవర’ మీద ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ విన్నా తారక్ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. భారీ హైప్ నెలకొనడంతో అన్ని ఏరియాల్లోనూ వసూళ్ల జాతర నడవడం పక్కా అని తెలుస్తోంది. ముఖ్యంగా నైజాంలో ‘దేవర’ రికార్డ్స్ అడ్డంగా నరకడం ఖాయంగా కనిపిస్తోంది.
‘దేవర’తో నైజాం ఏరియాలో ఎన్టీఆర్ కొత్త చరిత్ర సృష్టించేలా ఉన్నాడు. తారక్-కొరటాల కాంబినేషన్ మూవీ కావడంతో భారీ హైప్ నెలకొంది. సినిమా నుంచి బయటకు వచ్చిన కంటెంట్ ఆ హైప్‌ను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లింది. దీంతో వసూళ్ల జాతర పక్కా అని చెప్పొచ్చు. అదే టైమ్‌లో టికెట్ రేట్లు పెరగడం, 1 AM బెనిఫిట్ షోలు ఎక్కువగా కన్ఫర్మ్ అవడం గ్రాండ్ ఓపెనింగ్స్ ఖాయమనే ఇండికేషన్స్ ఇస్తున్నాయి. మిగతా షోల కంటే బెనిఫిట్ షోస్ టికెట్స్ అఫీషియల్‌గానే మరింత భారీగా ఉంటాయనే విషయం తెలిసిందే. వీటన్నింటినీ బట్టి చూస్తే.. నైజాంలో ఫస్ట్ డేనే ఈజీగా రూ.20 కోట్ల క్లబ్‌లోకి ‘దేవర’ అడుగు పెట్టేలా ఉంది. ఒకవేళ ఇదే జరిగితే ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ రికార్డు కనుమరుగవుతుంది. ఈ మూవీ నైజాంలో రిలీజ్ డే నాడు రూ.19.60 కోట్లు కలెక్ట్ చేసింది.
తొలి రోజు మరింత వసూళ్లు సాధించడంలో ‘దేవర’ సక్సెస్ అయితే ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును కూడా దాటేసే ఛాన్స్ ఉంది. నైజాంలో ఫస్ట్ డే వసూళ్లలో ‘ఆర్ఆర్ఆర్’ (రూ.23.35 కోట్లు) టాప్‌లో ఉంది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్‌లో ‘సలార్’ (రూ.22.55 కోట్లు) ఉంది. మూడో స్థానంలో ‘కల్కి’ ఉండగా.. నాలుగు, ఐదు స్థానాల్లో వరుసగా ‘గుంటూరు కారం’ (రూ.16.45 కోట్లు), ‘ఆదిపురుష్’ (రూ.13.68 కోట్లు) ఉన్నాయి. ప్రస్తుతం సినిమా మీద ఉన్న హైప్, క్రేజ్ చూస్తుంటే ‘కల్కి’ని ‘దేవర’ దాటేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, తారక్ మూవీ టికెట్ రేట్స్ పెంచుకునేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. నైజాం ఏరియాలో మల్టీప్లెక్స్‌ల్లో ఒక్కో టికెట్ రూ.413, సింగిల్ స్క్రీన్లలో రూ.250కు పెరిగాయి.
‘దేవర’ చిత్రానికి ఏపీలోని మల్టీప్లెక్స్‌ల్లో రూ.325, సింగిల్ స్క్రీన్లలో రూ.200 దాకా టికెట్ల ధరలు పెంచుకునేందుకు పర్మిషన్స్ వచ్చాయి. అటు.. 12 AM స్పెషల్ షోల టికెట్ ధరను రూ.1,000, మార్నింగ్ 4 AM షోలకు రూ.500కు పెంచాలని ‘దేవర’ మేకర్స్ ప్రభుత్వాలను కోరారని తెలుస్తోంది. మూవీ మీద ఉన్న బజ్, పెరిగిన టికెట్ రేట్స్ చూస్తుంటే నైజాంతో పాటు ఇతర ఏరియాల్లోనూ ‘దేవర’ రికార్డులను అడ్డంగా నరకడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది నిజమైన మాస్ అనే చెప్పాలి. చిత్రానికి పాజిటివ్ టాక్ కూడా తోడైతే వసూళ్ల ఊచకోత నెక్స్ట్ లెవల్లో ఉండటం పక్కా. మరి.. ‘దేవర’ నైజాంలో ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.