Dharani
భారీ అంచనాలతో విడుదలైన డార్లింగ్ ప్రభాస్ సలార్ సినిమా మొదటి రోజు, మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో సినిమాలో నటించిన వారి రెమ్యూనరేషన్ వివరాలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు..
భారీ అంచనాలతో విడుదలైన డార్లింగ్ ప్రభాస్ సలార్ సినిమా మొదటి రోజు, మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో సినిమాలో నటించిన వారి రెమ్యూనరేషన్ వివరాలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు..
Dharani
బాహుబలి సినిమా తర్వాత డార్లింగ్ ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి పెరిగింది. బాహుబలి సిరీస్ తర్వాత.. ప్రభాస్ చేసినవన్ని పాన్ ఇండియా సినిమాలే. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి చిత్రాల్లో నటించాడు. కానీ అవేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఎమోషన్స్, యాక్షన్ అన్ని యాంగిల్స్ లో ప్రభాస్ ను చూడాలనుకున్న అభిమానులకు ఆ సినిమాలేవి రుచించలేదు. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన సలార్ సినిమా మీద భారీ ఎత్తున అంచనాలు పెరిగిపోయాయి. రెండు పార్ట్ లుగా ఈ సినిమాను తెరకెక్కించారు. మొదటి భాగమైన సలార్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు, ప్రీరిలీజ్ ఈవెంట్ లేకుండా ఈ సినిమా విడుదలయ్యింది. ఆరేళ్లుగా ఎదురు చూస్తోన్న అభిమానులకు సలార్ సినిమా ఫుల్ మీల్స్ లా మారింది.
ఫుల్ మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ నటన, నీల్ ఇచ్చిన ఎలివేషన్స్ చూస్తే గూస్ బంప్స్ రావడం పక్కా. ఇన్నాళ్లుగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు సలార్ సినిమాతో అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు నీల్. ప్రభాస్ మాస్ నట విశ్వరూపం చూసి ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సలార్ సినిమాతో పాటు విడుదలైన డంకీ సినిమా.. ప్రభాస్ క్రేజ్ ముందు తేలిపోయింది. షారుక్ మూవీని తీసేసి.. సలార్ సినిమా వేస్తున్నారంటే.. సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది. ఇక కేజీఎఫ్ 1, 2 సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న నీల్.. ఇప్పుడు సలార్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించాడు. ఈ సినిమాకు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రుతిహాసన్, ఈశ్వరి రావు, శ్రీయా రెడ్డి కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించారు. హోంబలే ఫిల్మ్స్.. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించింది. ఇక సలార్ విడుదలకు కోసం చాలాకాలంగా ఆత్రుతగా ఎదురుచూసిన అభిమానులు థియేటర్స్ వద్ద చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక సినిమా రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నటించిన నటీనటుల రెమ్యునరేషన్స్ గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
మొత్తం రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన సలార్ సినిమా కోసం రెబల్ స్టార్ ప్రభాస్ సుమారు రూ.100 కోట్లు పారితోషికం తీసుకున్నాడట. అలాగే లాభాల్లో 10 శాతం షేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దాదాపు రూ.50 కోట్లు తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో కథనాయిక ఆద్య పాత్రలో కనిపించిన శ్రుతిహాసన్.. రూ.8 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందట. అలాగే కీలకపాత్రలలో నటించిన జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇద్దరూ రూ.4 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.