iDreamPost
android-app
ios-app

Kalki 2898 AD: బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తున్న కల్కి.. రూ.1000 కోట్ల క్లబ్‌ వైపు పరుగులు

  • Published Jul 07, 2024 | 2:28 PM Updated Updated Jul 07, 2024 | 2:28 PM

ఇప్పటికే బాక్సాఫీసు కల్కి ఊచకోత కోస్తూ దూసుకెళ్తోంది. ముఖ్యంగా అద్భుతమైన ఆక్యుపెన్సీతో దూసుకుపోవడమే కాకుండా.. తాజాగా ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది. ఈ క్రమంలోనే త్వరలోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరేందుకు శరవేగంగా అడుగులు వేస్తుంది.

ఇప్పటికే బాక్సాఫీసు కల్కి ఊచకోత కోస్తూ దూసుకెళ్తోంది. ముఖ్యంగా అద్భుతమైన ఆక్యుపెన్సీతో దూసుకుపోవడమే కాకుండా.. తాజాగా ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది. ఈ క్రమంలోనే త్వరలోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరేందుకు శరవేగంగా అడుగులు వేస్తుంది.

  • Published Jul 07, 2024 | 2:28 PMUpdated Jul 07, 2024 | 2:28 PM
Kalki 2898 AD: బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తున్న కల్కి.. రూ.1000 కోట్ల క్లబ్‌ వైపు పరుగులు

ప్రస్తుతం బాక్సాఫీసు కల్కి 2898 AD ఊచకోత కోస్తూ దూసుకెళ్తోంది. ముఖ్యంగా పాన్‌ ఇండియా స్టార్‌ అయినా ప్రభాస్‌ తన రికార్డులను తానే బ్రేక్‌ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు. కాగా, ఇతిహాస గాధలకు.. సైన్స్ ఫిక్షన్ మిళితం చేసి నాగ్ అశ్విన్ చేసిన’ కల్కి 2898 AD’ ప్రయోగం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. అందుకే బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. అంతేకాకుండా..సినిమా రిలీజ్‌ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాన్‌ స్టాప్‌ కలెక్షన్స్‌ పరంగా కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ క్రమంలోనే.. కల్కి అద్భుతమైన ఆక్యుపెన్సీతో దూసుకుపోవడమే కాకుండా.. తాజాగా ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకి పైగా వసూళ్లను సాధించినట్లు స్వయంగా మూవీ టీమ్‌ ప్రకటించింది. అలాగే త్వరలోనే రూ.1000 కోట్లు దిశగా పరుగులు పెడుతున్నట్లు పేర్కొంది.

ఇప్పటికే టాలీవుడ్‌ లో బాహుబలి, ది కన్‌క్లూజన్’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఏ మూవీ రూ.1000 కోట్లు  చేరే రికార్డులే లేవు. కానీ, తాజాగా కల్కి మాత్రం రిలీజ్‌ అయిన వారం రోజులకే రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరేందుకు శరవేగంగా అడుగులు వేస్తుంది. కాగా, ఇప్పటికే రూ.800 కోట్లకి పైగా వసూళ్లను సాధించినట్లు స్వయంగా మూవీ టీమ్‌ తాజాగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది.  ఈ క్రమంలోనే మరి కొద్ది రోజుల్లోనే కల్కి  కూడా ఈ మేజిక్ ఫిగర్‌ను చేరే అవకాశం ఉంది.  అయితే ఒకవేళ అదే  జరిగితే టాలీవుడ్ చరిత్రలోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన మూడవ చిత్రంగా నిలుస్తుంది కల్కి. ఇక ఉత్తర అమెరికాలో కల్కి ఇప్పటికే బీభత్సంగా కొనసాగుతోంది. కాగా, ఈమేరకు అక్కడ కల్కి  14.5 మిలియన్ డాలర్లకి పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. మరోవైపు ఒక్క తమిళనాడులోనే మొదటి వారంలో రూ.28 కోట్లకిపైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. అలాగే ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమాలేమీ లేకపోవడంతో కల్కి హవా జోరుగా కొనసాగుతుంది.

ఇకపోతే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, పశుపతి, రాజేంద్ర ప్రసాద్, అన్నా బెన్, మాళవిక నాయర్ వంటి స్టార్స్‌ కీలక పాత్రలు పోషించారు. అలాగే దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అనుదీప్, ఫరియా అబ్దుల్లా అతిథి పాత్రల్లో మెరిశారు. ఇక కల్కి సినిమాను  వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వినీదత్‌  నిర్మించారు.  అలాగే సంతోష్‌ నారాయణన్‌ సినిమాకి మ్యూజిక్ అందించారు. ఇక కల్కి పార్ట్ 1 థియేటర్లలో ఉండగానే పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ చేస్తారంటూ అభిమానులు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. కానీ నిర్మాత అశ్వినీదత్ మాత్రం రెండో భాగం 2026లోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయం తెలిజయజేసినట్లు సమాచారం. మరి, త్వరలోనే కల్కి రూ.1000 కోట్ల దిశగా పరుగులు పెట్టడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.