iDreamPost
android-app
ios-app

సీతారామం డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా ఫిక్స్? అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే..

  • Author Soma Sekhar Published - 05:29 PM, Tue - 4 July 23
  • Author Soma Sekhar Published - 05:29 PM, Tue - 4 July 23
సీతారామం డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా ఫిక్స్? అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే..

సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ అంతా.. ఇంత కాదు. ఇక హిట్ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. అలాగే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కలిసి చేయని కాంబినేషన్ లో మూవీ వస్తుందన్నా అంతే స్థాయిలో అభిమానుల్లో అంచనాలు ఉంటాయి. కాగా.. ఇండస్ట్రీలో మూడో రకం కాంబినేషన్ కూడా ఉందండోయ్.. ఓ పాన్ ఇండియా స్టార్ హీరో.. ఓ డీసెంట్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడంటే.. ఆ మూవీపై కూడా అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. తాజాగా ఇలాంటి కాంబోనే టాలీవుడ్ లో రాబోతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

హను రాఘవపూడి.. అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీ మెుత్తాన్ని తనవైపు చూసేలా చేసుకున్నాడు. ఆ తర్వాత డీసెంట్ మూవీస్ తీసి.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ బ్రాండ్ ను, మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక సీతారామం సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి.. పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. హృదయానికి హత్తుకునేలా సినిమా తియ్యడంలో హను రాఘవపూడి సిద్దహస్తుడనే చెప్పాలి. ఆయన తీసింది 5 సినిమాలే అయినప్పటికీ.. ప్రేక్షకుల హృదయాల్లో తన మార్క్ ను క్రియేట్ చేసుకున్నారు. కాగా.. ఇప్పుడు మెగా ఫోన్ పట్టబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనడుస్తోంది.

ఈసారి ఏకంగా డార్లింగ్ ప్రభాస్ నే డైరెక్ట్ చేయబోతున్నాడట ఈ సీతా రామం డైరెక్టర్. ఇక ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారట. త్వరలోనే అఫీషీయల్ అనౌన్స్ మెంట్ ను మేకర్స్ చేయబోతున్నట్లు ఫిల్మ్ నగర్ లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. మరి చక్కటి ప్రేమ కథలను తెరకెక్కించడంలో హను రాఘవపూడిది అందెవేసిన చేయి. అలాంటి డైరెక్టర్ ప్రభాస్ ను ఎలా చూపిస్తాడో.. చూడాలని ఆశగా ఎదురుచూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇక ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె లాంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. మరి ఈ మూవీస్ కంప్లీట్ చేయగానే హను డైరెక్షన్ లో మూవీ చేస్తాడో చూడాలి మరి.

Jojobet GirişmeritbetcasibomJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel