iDreamPost
android-app
ios-app

సడన్ గా విదేశాలకు ప్రభాస్.. విషయమేంటని ఆరా తీస్తున్న ఫ్యాన్స్!

  • Author ajaykrishna Updated - 03:21 PM, Wed - 13 September 23
  • Author ajaykrishna Updated - 03:21 PM, Wed - 13 September 23
సడన్ గా విదేశాలకు ప్రభాస్.. విషయమేంటని ఆరా తీస్తున్న ఫ్యాన్స్!

ఇండస్ట్రీలో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న హీరోలలో ప్రభాస్ ఒకరు. పాన్ ఇండియా స్టార్ అయిన డార్లింగ్.. చేతినిండా సినిమాలను లైనప్ చేసి పెట్టుకున్నాడు. మెల్లగా ఒక్కో సినిమా కంప్లీట్ చేస్తూ.. రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు. ఈ ఏడాది ఆదిపురుష్ తర్వాత సలార్ సినిమాని రిలీజ్ కి రెడీ చేసిన ప్రభాస్.. ప్రస్తుతం కల్కి, డైరెక్టర్ మారుతీ సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. అయితే.. సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సిన సలార్ సడన్ గా కొన్ని కారణాల వలన వాయిదా పడింది. దీంతో ఒక్కసారిగా ప్రభాస్ ఫ్యాన్స్ లో నిరాశ నెలకొంది. ప్రభాస్ కు సంబంధించి ఈ మధ్యకాలంలో ఏ సినిమా కూడా అనుకున్న టైమ్ కి రిలీజ్ కాలేదని బాధపడుతున్నారు ఫ్యాన్స్.

ఇక తాజాగా ప్రభాస్ కి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ప్రభాస్ సడన్ గా విదేశాలకు పయనం అయ్యాడట. ఎందుకో కారణం తెలియలేదు. కానీ.. దాదాపు పదిహేను రోజులు అక్కడే ఉంటాడని సమాచారం. అయితే.. ఈ టూర్ కోసం మారుతీ సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం హీరో లేకుండా సీన్స్ షూట్ చేస్తున్నారట. కాగా.. ఇప్పుడు ఇంత సడన్ గా డార్లింగ్ ఎందుకు విదేశాలకు వెళ్లాడనే సందేహం ఫ్యాన్స్ అందరిలోనూ మొదలైంది. దానికి కూడా నెట్టింట కథనాలు వినిపిస్తున్నాయి.

ప్రభాస్ కి మోకాలు సర్జరీ అని కొన్నాళ్ళుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య కల్కి షెడ్యూల్ కంప్లీట్ చేసి విదేశాలకు వెళ్తాడని అన్నారు. ఇప్పుడు మారుతీ మూవీ షెడ్యూల్ ప్లాన్ చేసి వెళ్తున్నాడని అంటున్నారు. సో.. అప్పుడు వీలు కాలేదని ఇప్పుడు వెళ్తున్నాడా? లేక సర్జరీ కాకుండా నార్మల్ గా వేకెషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాడా అనేది తెలియాల్సి ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ ఏడాది ఆదిపురుష్ తో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్.. సెప్టెంబర్ లో సలార్ తో ఇండస్ట్రీని షేక్ చేసేస్తాడని అంతా అనుకున్నారు. కానీ.. ఎవరు ఊహించని విధంగా షాకింగ్ ట్విస్టు ఇచ్చారు మేకర్స్. పైగా తెలిసిన విషయాన్నీ చావు కబురు చల్లగా చెప్పినట్లు ఇన్నిరోజులకు కన్ఫర్మ్ చేశారు. మరి సలార్ ప్రభాస్ ల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom