iDreamPost
android-app
ios-app

ప్రభాస్ ఫ్యాన్స్‌ టెన్షన్‌.. ‘సలార్‌’ కి వెయ్యి సాధ్యమేనా?

  • Published Dec 05, 2023 | 5:44 PM Updated Updated Dec 05, 2023 | 5:44 PM

Salar Movie: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న మూవీ సలార్. ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఓ విషయంపై ప్రభాస్ అభిమానుల్లో టెన్షన్ పట్టుకుందని టాక్.

Salar Movie: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న మూవీ సలార్. ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఓ విషయంపై ప్రభాస్ అభిమానుల్లో టెన్షన్ పట్టుకుందని టాక్.

  • Published Dec 05, 2023 | 5:44 PMUpdated Dec 05, 2023 | 5:44 PM
ప్రభాస్ ఫ్యాన్స్‌ టెన్షన్‌.. ‘సలార్‌’ కి వెయ్యి సాధ్యమేనా?

ప్రభాస్‌.. మిర్చి సినిమా వరకు ఒక లెక్క.. ఆ తర్వాత బాహుబలి చేయడంతో మరో లెక్క అన్నట్లుగా ఆయన కెరీర్ మారిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. బాహుబలి రెండు పార్ట్‌ లు కూడా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాతో ప్రభాస్‌ పాన్ ఇండియా స్టార్‌ అయ్యాడు. బాహుబలి సినిమా కారణంగా చాలా మంది బాలీవుడ్ స్టార్స్ కి కూడా లేనంత క్రేజ్‌, ఫాలోయింగ్ ప్రభాస్ కి దేశవ్యాప్తంగా దక్కింది. కేవలం ఇండియాలోనే కాకుండా విదేశీ భాషల ప్రేక్షకులకు కూడా బాహుబలి తో ప్రభాస్ చేరువ అయిన విషయం తెల్సిందే. బాహుబలి వంటి సినిమా తర్వాత ప్రభాస్ నుంచి వచ్చే ప్రతి సినిమాను కూడా అంతకు మించి అన్నట్లుగా ప్రేక్షకులు, ఆయన ఫ్యాన్స్ ఆశించారు. కానీ బాహుబలి తర్వాత వచ్చిన మూడు సినిమాలు నిరాశనే మిగిల్చాయి.

ప్రభాస్‌ బాహుబలి-2 సినిమా తర్వాత సాహో సినిమాతో వచ్చాడు. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ను హిందీ ప్రేక్షకులు పర్వాలేదు అంటే.. సౌత్ ప్రేక్షకులు ఫ్లాప్ అన్నారు. ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్‌ సినిమాను బాలీవుడ్, టాలీవుడ్  ప్రేక్షకులు అందరూ కూడా డిజాస్టర్‌ అన్నారు. ఉత్తర భారతంలో మినిమం వసూళ్లు సాధించకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక హిందీలో చేసిన ఆదిపురుష్ సినిమా తో కూడా ప్రభాస్ హిట్ అందుకోలేక పోయాడు. ఫ్లాప్స్‌ తో హ్యాట్రిక్ కొట్టిన ప్రభాస్ నెక్ట్స్ ‘సలార్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

కేజీఎఫ్‌ సినిమా తో దర్శకుడిగా ప్రశాంత్‌ నీల్ కి ఆకాశమే హద్దు అన్నట్లుగా క్రేజ్‌, ఇమేజ్ పెరిగింది. ఆయన నుంచి రాబోతున్న సినిమా కేజీఎఫ్‌ ని మించి ఉంటుందని ప్రేక్షకులు చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే సలార్‌ సినిమా పై ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఇదే సమయంలో ప్రభాస్ ఫ్యాన్స్ లో టెన్షన్ కనిపిస్తోంది. ఇప్పటికే మూడు వరుస ఫ్లాప్స్ ని చవి చూసిన ప్రభాస్‌ సలార్‌ ఫలితం తారుమారు అయితే పరిస్థితి ఏంటి అన్నట్టుగా చర్చించుకుంటున్నారు. ప్రభాస్ గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో చాలా మంది అనుకుంటున్నట్లుగా సలార్‌ రూ.వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేస్తుందా అనే చర్చ కూడా ఆయన  ఫ్యాన్స్ లో జరుగుతోంది.

వెయ్యి కోట్ల మూవీ అంటూ ప్రచారం చేసినప్పుడు కచ్చితంగా అందులో సగం వసూళ్లు వచ్చినా కూడా అది ఫ్లాప్‌ మూవీగానే పరిగణిస్తారు. అందుకే ఇప్పుడు ప్రభాస్‌ ఫ్యాన్స్ సలార్‌ పై పెరుగుతున్న అంచనాల నేపథ్యంలో టెన్షన్‌ పడుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దయతో సలార్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే ప్రభాస్ ఊపిరి పీల్చుకోవచ్చు. మరి సలార్‌ తో ప్రభాస్‌ కి మరియు ఆయన అభిమానులకు ఊరట లభించేనా చూడాలి. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు షారుఖ్‌ ఖాన్ డుంకీ తో పెద్ద పోటీ ఎదురు చూస్తోంది. మరి సలార్ ఆ పోటీని ఎలా తట్టుకుంటుంది అనే టెన్షన్ కూడా ప్రభాస్‌ ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. మరి.. ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbetjojobetgrandpashabetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetcepbahis girişEscortes BelgiqueCasibomGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomcasibom